
Weight Lose Food : మనలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. మనిషి ఉండాల్సిన దాని కంటే ఎక్కువ ఉంటే దాన్ని అధిక బరువు అంటారు. దీంతో అనేక ఇబ్బందులు వస్తాయి. ఒక బండి ఎంత బరువు మోయగలదో అంతే బరువు ఉంచుతాం. ఎక్కువ బరువు ఉంటే అది మొండికేస్తుంది. మన శరీరం కూడా అంతే. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉంటే ఇతర అవయవాల మీద ప్రభావం పడటం ఖాయం. అధిక బరువును అదుపులో ఉంచుకోవచ్చు. కొన్ని రకాల ఆహార అలవాట్లతో అధిక బరువును కంట్రోల్ లో కి తేవచ్చు. అవేంటో చూద్దాం.
గుడ్లు
బలవర్థకమైన ఆహారాల్లో గుడ్డు ఒకటి. ఇది జంతు సంబంధమైనదైనా ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. దీంతో రోజు అల్పాహారంలో గుడ్డు తీసుకోవడం మంచిదే. దీని వల్ల మనకు త్వరగా ఆకలి వేయకుండా నిరోధిస్తుంది. వైద్యులు కూడా చెబుతున్నారు రోజుకో గుడ్డు తినాలని. ఇందులో ఉండే ప్రొటీన్లతో మనకు ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయి. అందులో అధిక బరువును నియంత్రణలో ఉంచే గుణం కూడా ఒకటి కావడం గమనార్హం.
గ్రీన్ టీ
మనలో చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. కొందరైతే టీ తాగనిదే దినచర్య కూడా ప్రారంభించరు. ఇలా ఉదయం టీకి బదులు గ్రీన్ టీ తాగడం మంచిది. దీంతో మనకు ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. అధిక బరువును నియంత్రించే గుణం గ్రీన్ టీకి ఉంటుంది. అందుకే ఉదయం గ్రీన్ టీ తీసుకుంటే మనకు ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయి.
మిర్చి
మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే గుణం మిర్చికి ఉంటుంది. కూరల్లో వీటిని విరివిగా వాడుకోవచ్చు. కూర కూడా భలే రుచిగా ఉంటుంది. మిరపకాయలు కూడా అధిక బరువును అదుపులో ఉంచుతాయి. దీంతో రోజు ఆహారంలో వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కారంపొడికి బదులు పచ్చి మిర్చి వాడుకుంటే మనకు లాభాలు ఎన్నో ఉన్నాయి.
ఆలివ్ ఆయిల్
వంటల్లో వాడే నూనెలు మనకు నష్టాలు కలిగిస్తాయి. నూనెలను వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు పోతాయి. అందుకే నూనెను వేడి చేయకుండా వాడుకుంటే మంచిది. కానీ మనం వేడి చేశాకే కూర చేస్తాం. వంట నూనెల్లో ఆవాల నూనె ఆరోగ్యానికి మంచిది. ఇది అధిక బరువును కంట్రోల్ లో ఉంచడానికి సాయపడుతుంది. ఇలా అధిక బరువు సమస్యను అధిగమించేందుకు జాగ్రత్తలు తీసుకుంటే నష్టం ఉండదు. అధిక బరువును నియంత్రణలో ఉంచుకోకపోతే మొదటికే మోసం వస్తుంది.