
Live Longer Food : ప్రస్తుత కాలంలో రోగాల గోల పెరుగుతోంది. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, గుండె జబ్బులు వంటి వ్యాధులకు దగ్గరవుతున్నారు. వందేళ్లు హాయిగా జీవించాల్సిన వారు పాతికేళ్లకే టపా కట్టేస్తున్నారు. దీనికి కారణం మన ఆహార అలవాట్లే కావడం గమనార్హం. మనం తింటున్న జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఫిజా, బర్గర్లు తింటూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యాధుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా మన వారిలో మార్పు రావడం లేదు. ఆహారం తీసుకోవడంలో నియంత్రణ తీసుకోవడం లేదు ఫలితంగా చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంటనలు అనేకం.
మన ఆరోగ్యాన్ని చేసుకునే క్రమంలో మనం కొన్ని ఆహార పద్ధతులు పాటించాలి. అప్పుడే మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆరోగ్య పరిరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది మన ఆహార అలవాట్లు బాగుంటే ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. దీని వల్ల మనకు రోగాలు రాకుండా ఉంటాయి. నూరేళ్లు రోగాలు రాకుండా జీవించాలంటే మనం కొన్ని పద్ధతులు ఆచరించాల్సిందే.
దానిమ్మ పండులో విటమిన్ ఎ, సి, ఇ లతో పాటు ఫైబర్, ప్రొటీన్లు, ఫొలేట్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. దీని వల్ల ఆయుష్షు పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్, యాంటీ ట్యూమర్ గుణాలు మనిషి ఎక్కువ కాలం జీవించడానికి దోహదపడతాయి. ముసలి తనం రాకుండా చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
రాత్రంతా నిలువ ఉన్న ఆహారాల్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే రాత్రి వండుకున్న అన్నం, పెరుగు లాంటివి మరుసటి రోజు తినడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ప్రొ బయోటిక్స్ మనకు మేలు చేస్తాయి. మన ఆరోగ్యం బాగు చేయడంలో ఇవి ఉపకరిస్తాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల మన శారీరక వ్యవస్థ మెరుగుపడుతుంది.

అరటికాయ కూడా మన శరీరానికి మంచిది. దీని వల్ల మంచి బ్యాక్టీరియా లభిస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంచడంలో ఇది సాయపడుతుంది. కిడ్నీ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్న వీటిని తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. యాభై ఏళ్లకే జీవితం ముగిసిపోకుండా వందేళ్లు ఉండాలంటే ఈ ఆహార అలవాట్లు చేసుకోవాల్సిందే మరి.