
Before Marriage : మనదేశంలో ఎన్నో ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఇందులో మన గొప్పతనం కనిపిస్తుంది.అందుకే విదేశీయులు సైతం మన సంప్రదాయాలు చూసి ఫిదా అవుతుంటారు. మనకు ఉన్న అలవాట్లతో మన విశిష్టతపై వారు ముచ్చట పడతారు. ప్రస్తుతం మారిన పద్ధతుల వల్ల మన ఆచార వ్యవహారాలపై సరైన అవగాహన ఉండటం లేదు. ఈ నేపథ్యంలో మనకు మొదటి గురువులు తల్లిదండ్రులే. వారు మనకు జీవి తంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో చెబుతుంటారు.
ప్రస్తుతం మన విద్యావిధానం మారిపోయింది. ఆరో తరగతి నుంచే హాస్టల్ జీవితాలకు అలవాటు పడిపోతున్నాం.పదో తరగతి అయ్యాక ఇక దూరంగానే ఉంటారు. తరువాత ఉద్యోగం వస్తే కూడా అక్కడే ఉంటున్నారు.దీంతో తల్లిదండ్రులతో మమేకం అయ్యే పరిస్థితి రావడం లేదు. ఈ క్రమంలో మనం ఆచరించే ఆచారాల గురించి వారికి తెలియడం లేదు. కానీ తల్లిదండ్రులు నేర్పాల్సిన అవసరం ఏర్పడింది.

వివాహం అయ్యాక ఆడ, మగ అయినా వారికి కొన్ని సూత్రాలు నేర్పాల్సిందే. కొత్త జీవితంలో ఎదురయ్యే గొడవలు ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేయాలి. ఇగోలను పక్కన పెట్టేయకపోతే కాపురం సజావుగా సాగదు. చిన్న చిన్న తగాదాల విషయంలో బేషజాలకు పోకుండా రాజీ ధోరణి అందరికి పరిష్కార మార్గం. పెళ్లయిన తరువాత ఇద్దరిలో సంయమనం ఉండేలా నేర్పించడం తప్పనిసరి.
పెళ్లయ్యాక ఎవరెవరికి ఎలా గౌరవం ఇవ్వాలి. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. పెద్దలతో ప్రేమగా మాట్లాడాలి. లేకపోతే మన మీద చులకన భావం ఏర్పడుతుంది. దీంతో దంపతులు ఎలా మసలుకోవాలో అవగాహన పెంచుకోవాలి. లేకపోతే సమస్యలు వస్తాయి. అందరిని మంచిగా ఆదరించాలి. అందరితో కలివిడిగా ఉండాలి. అప్పుడే మనపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఇవన్ని తల్లిదండ్రులు నేర్పించడం తప్పనిసరి. అందుకే వారిలో గౌరవ మర్యాదలు నేర్పించాలి.