
Thyroid Food: ఇటీవల కాలంలో వస్తున్న వ్యాధుల్లో మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, థైరాయిడ్ వంటివి తరచుగా వస్తున్నాయి. థైరాయిడ్ గొంతు ముందు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది కొన్ని హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల శరీర ఉష్ణోగ్రత, బరువు, కొవ్వు తదితర వాటిపై ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ సమస్య ఐదు రకాలుగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అని పిలుస్తుంటారు. థైరాయిడ్ గ్రంథి నాలుగు హార్మోన్లను తిన మోతాదులో ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఏర్పడే దాన్ని హైపో థైరాయిడిజం అని అంటారు. దీని లక్షణాలు చూస్తే బరువు పెరగడం, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం, కొలెస్ట్రాల్ పెరగడం లాంటివి కనిపిస్తాయి.
ముఖం వాయడం, మలబద్ధకం, కండరాలు అసౌకర్యంగా ఉండటం వంటి సమస్యలు వస్తాయి. మనం వాడే ఉప్పులో అయోడిన్ ఉండేలా చూసుకోవాలి. అయోడిన్ తక్కువైనప్పుడు థైరాయిడ్ సమస్యకు దారి తీస్తుంది. ఉప్పు వాడుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు కొవ్వు పెరగకుండా చూసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాట్ ఉండేలా తీసుకోవాలి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటంతో వాటిని తరచుగా ఆహారంగా తీసుకోవడం ఉత్తమం. మన ఆహారం విషయంలో శ్రద్ధ వహించాలి.
ప్రతి రోజు గుడ్లు తినాలి. చిక్కుళ్లు, ఆలివ్ ఆయిల్, చికెన్, పాల ఉత్పత్తులు వంటివి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. గ్రీన్ టీ, సోయా అధికంగా ఉండేలా జాగ్రత్తలు వహించాలి. థైరాయిడ్ గ్రంథి ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేయడం వల్ల హైపర్ థైరాయిడిజం వస్తుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆందోళన, నిద్ర రాకపోవడం, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటివి కనిపిస్తాయి.

బ్రోకొలి, క్యాబేజీ, క్యారెట్లు, క్యాలీఫ్లవర్, ముల్లంగి, క్యాప్సికం వంటి కూరగాయలు తినడం మంచిది. హైపర్ థైరాయిడిజం ఉన్న వారు పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల కూడా మంచి లాభాలున్నాయి. గ్రీన్ టీ తీసుకోవాలి. సముద్రపు చేపలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. సెలీనియం, జింక్ ఉన్న ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకుంటే గుండె సంబంధిత రోగాలు రాకుండా కూడా పనిచేస్తాయి. ఇలా థైరాయిడ్ సమస్య ఉన్న వారు తమ ఆహారాల్లో మార్పులు చేసుకుంటే మంచిదే.