
Charmi- Puri Jagannadh: దర్శకుడు పూరి జగన్నాధ్, హీరోయిన్ ఛార్మిలది ఒడిదుడుకుల ప్రయాణం. ముఖ్యంగా ఛార్మి ఒక బోల్డ్ లైఫ్ లీడ్ చేస్తుంది. పూరితో అనుబంధం పెరిగాక నటనకు గుడ్ బై చెప్పేశారు. నిర్మాణ భాగస్వామిగా పూరితో ట్రావెల్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రాలన్నీ ప్లాప్. ఒక్క ఇస్మార్ట్ శంకర్ మాత్రమే సూపర్ హిట్. 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ దివాళా దశలో ఉన్న పూరి-ఛార్మీలకు ఊపిరి పోసింది. ఆ మూవీ సక్సెస్ తో పోయినవన్నీ మళ్ళీ రాబట్టుకున్నారు. లగ్జరీ లైఫ్ స్టార్ట్ చేశారు.
వాళ్ళ ఆనందాన్ని లైగర్ ఫెయిల్యూర్ దెబ్బతీసింది. ఎన్నో ఆశలతో తీసిన పాన్ ఇండియా చిత్రం లైగర్ అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ కారణంగా ఆల్రెడీ మొదలైన జనగణన మూవీ ఆగిపోయింది. లైగర్ నష్టాలు చెల్లించాలని బయ్యర్ల గొడవలు చేశారు. పూరి బెదిరింపులకు దిగాడు. మరోవైపు ఈడీ విచారణ జరిపింది. లైగర్ మూవీ బడ్జెట్ తో పాటు వ్యాపార లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని అధికారులు పూరి, ఛార్మి, విజయ్ దేవరకొండలను విచారించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఛార్మి అజ్ఞాతంలోకి వెళ్లారు. నెలలుగా ఛార్మి కనీసం సోషల్ మీడియా పోస్ట్స్ కూడా చేయడం లేదు. నవంబర్ లో మాత్రం హ్యాపీ గురుపురబ్ అంటూ పంజాబీ పండగ విషెస్ తెలియజేశారు. కాగా ఎట్టకేలకు ఛార్మి కాలు బయట పెట్టారు. ఆమె దర్శకుడు పూరితో పాటు ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు. కాగా ఛార్మిలో ఓ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆమె బరువు పెరిగారు. అది తెలియకుండా ఉండేందుకు లూజుగా సరికొత్త డిజైనర్ వేర్ ధరించారు. పూరి-ఛార్మి ముంబై వెళ్లారంటే… కొత్త సినిమా చర్చల కోసమే అన్న ప్రచారం జరుగుతుంది.

ఇక లైగర్ మూవీతో పూరి, ఛార్మి నష్టపోయిందేమీ లేదన్న వాదన ఉంది. అధిక ధరలకు లైగర్ మూవీ అమ్ముకుని వారిద్దరూ సేఫ్ అయ్యారట. డిజిటల్, శాటిలైట్ రైట్స్ తో మరికొంత ఆదాయం వచ్చిందట. నష్టపోయింది బయ్యర్లే కానీ నిర్మాత పూరి, ఛార్మి కాదన్న వాదన ఉంది. అలాగే హీరో విజయ్ దేవరకొండకు రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామన్నారట. సినిమా విడుదలయ్యాక తీసుకోవచ్చని విజయ్ దేవరకొండ నిర్లక్ష్యం చేశాడట. మూవీ ప్లాప్ సాకు చూపి ఆయనకు పూర్తిగా రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదట. లైగర్ తో పూరి-ఛార్మి పెద్ద మొత్తంలో సంపాదించారనే ప్రచారమైతే ఉంది.