Chiranjeevi– Sridevi: సినిమా ఇండస్ట్రీలో ఆమె ఒక అద్భుతమైన నటనా నైపుణ్యం ఉన్నటువంటి హీరోయిన్ మాత్రమే కాదు ఆమె సినిమా ఇండస్ట్రీకి ఒక అతిలోక సుందరి.ఈమె బాల నటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఎంతో మంది దర్శకులకు స్టార్డమ్ తెచ్చిపెట్టింది. అలాగే ఎంతోమంది నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ఈమె పక్కన నటించిన ఎంతో మంది హీరోలు స్టార్ సెలబ్రిటీలు గా మారిపోయారు. ఇలా సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవి ఎంతో అద్భుతమైనతో తెలుగు తమిళ హిందీ భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి ఆదరణ దక్కించుకున్నారు.

ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో పాటు తెలుగులో ఈమెకు అదే స్థాయిలో క్రేజ్ ఉండేది. ఈమె క్రేజ్ వల్ల పలువురు దర్శక నిర్మాతలు ఈమెతో సినిమా తీయాలని ఇంటి ముందు క్యూ కట్టేవారు.అయితే శ్రీదేవి సినిమా ఇండస్ట్రీలో ఎంతో మందికి మంచి పేరు సంపాదించినప్పటికీ చిరంజీవికి మాత్రం చాలా నష్టం కలిగిందని చెప్పవచ్చు. శ్రీదేవి కారణంగా చిరంజీవి నటించాల్సిన ఎన్నో సినిమాలు ఆగిపోయాయి.అందుకు గల కారణం కేవలం శ్రీదేవి స్టార్ హీరోయిన్ అన్న కారణంగా ఈమె పెట్టిన కండిషన్లకు దర్శకనిర్మాతలు ఒప్పుకోకపోవడంతో చిరంజీవితో నటించాల్సిన ఈమె సినిమాలు ఆగిపోయాయి.
మరి శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఆగిపోయిన ఆ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో శ్రీదేవి మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వజ్రాల దొంగ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారు. ఈ సినిమాకు నిర్మాతగా శ్రీదేవి వ్యవహరించారు.అయితే ఇందులో శ్రీదేవి పాత్రను హైలెట్ చేయాలనే కండిషన్లు పెట్టడంతో మెగాస్టార్ ని తక్కువ చేసి చూపించడం ఇష్టంలేక దర్శకుడు సినిమాని క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత కొండవీటిదొంగ సినిమాలో ముందుగా చిరంజీవి సరసన శ్రీదేవి భావించారు అయితే ఈ సినిమాలో చిరంజీవితో సమానంగా తనకు ఫైట్ సన్నివేశాలు పెట్టాలని కొండవీటి దొంగ బదులు కొండవీటి రాణి అనే టైటిల్ పెట్టాలని కండిషన్ పెట్టడంతో దర్శకులకు ఇది ఇష్టం లేక ఈ సినిమా నుంచి ఆమెను తప్పించారు.
Also Read: Pushpa Movie Pre release Event: “పుష్ప” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా అల్లు వారసులు…
ఇలా కొండవీటి దొంగ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవిక్రేజ్ అమాంతం పెరిగి పోవడంతో చిరంజీవితో కలిసి నటించాలంటే రెండు మెట్లు దిగాలి అని తెలుసుకున్న శ్రీదేవి ఎలాంటి కండిషన్లు లేకుండా చిరంజీవితో కలిసి నటించడానికి సిద్ధమైంది ఈ క్రమంలోనే జగదేకవీరుడు అతిలోకసుందరి, ఎస్పీ పరశురామ్, వంటి చిత్రాలలో నటించారు.
Also Read: Pawan Kalyan: నీదేం పోయింది పవన్… బొక్క నిర్మాతలకేగా