Homeలైఫ్ స్టైల్Husband And Wife Relationship: భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి కారణాలేంటో తెలుసా?

Husband And Wife Relationship: భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి కారణాలేంటో తెలుసా?

Husband And Wife Relationship: కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందంటారు. దాంపత్యంలో అరమరికలు లేకుండా చూసుకోవాలి. అనుమానాలు, అపార్థాలకు తావుండకూడదు. అభిప్రాయ భేదాలు రాకూడదు. సాగరాన్నయినా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదడం అంత సులువు కాదని చెబుతారు. అలాంటి కాపురాలు కల్లలవుతున్నాయి. చిన్న పాటి విషయాలనే పెద్దవిగా చూసుకుంటున్నారు. కలిసి ఉండటం కంటే విడిపోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. నూరేళ్లు జంటగా ఉండాల్సిన వారిలో కలతలు కకావికలం చేస్తున్నాయి. మన వివాహ వ్యవస్థపై పాశ్చాత్యులే అభిమానం చూపిస్తుంటే మన వారిలో ఆ తీరు కనిపించడం లేదు.

Husband And Wife Relationship
Husband And Wife Relationship

విడాకులు కావాలని పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా కోరుతున్నారు. పట్టింపులకు ఉన్న విలువ పెళ్లికి ఇవ్వడం లేదు. చిన్న విషయాలకే గొడవ పడి విడాకుల వరకు వెళ్తున్నారు. అసలు ఎందుకు విడాకులకు ప్రాధాన్యం ఇస్తున్నారంటే విస్తు గొలిపే విషయాలు బహిర్గతం అవుతున్నాయి. దేశంలో దాదాపు 72 శాతం మహిళలు తమకు లైంగిక సంతృప్తి కలగడం లేదని చెబుతున్నారు. జీవిత భాగస్వామి తమను పట్టించుకోకుండా అక్రమ సంబంధాల వైపు చూస్తున్నారని కూడా ఎక్కువ మంది వెల్లడించడం గమనార్హం.

యాంత్రిక జీవనంలో కెరీర్ ముఖ్యమని భార్యలను పట్టించుకోవడం లేదు. దీంతోనే వారిలో భర్తల మీద ప్రేమ తగ్గుతోంది. ఫలితంగా విడాకుల వరకు వెళ్తున్నారు. అక్రమ సంబంధాలు కూడా మరో కారణంగా చెబుతున్నారు. ఒకరిపై మరొకరికి గౌరవం ఇచ్చుకోవడ లేదు. ఒకరి ఆలోచనలకు మరొకరు గుర్తించలేకపోతున్నారు. అందుకే అభిప్రాయ భేదాలతో విడాకులకు మొగ్గుచూపుతున్నారు. ఇగో వల్ల తమలోని అహం దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే ఇలాంటి వాటికి దగ్గరవుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.

Husband And Wife Relationship
Husband And Wife Relationship

వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులతోనే అసంతృప్తి గా ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. జీవిత భాగస్వామితో కలయిక అసంతృప్తిగా మారడంతో విడాకులు కోరుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ఇంకా వివాహేతర సంబంధాలు కూడా ఇంకో కారణంగా నిలుస్తున్నాయి. దేశంలోని 72 శాతం మంది మహిళలు భర్తల వల్లే విడిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నారు. లైంగిక పరమైన సమస్యల్లో 23 శాతం పురుషులు, 17 శాతం మహిళలు తమ భాగస్వాములను మోసం చేస్తున్నారని సర్వే చెబుతోంది. చాలా మంది పురుషులు నిజాలు వెల్లడించకుండా దాచేస్తూ పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత తెలియడంతోనే విడాకుల వరకు వెళ్తున్నట్లు సమాచారం.

శృంగారం విషయంలో దంపతుల మధ్య అవగాహన లేకపోవడం కూడా ఒక కారణంగానే తెలుస్తోంది. దంపతుల్లో ఎవరో ఒకరు ఇతరులతో శృంగారం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో దంపతుల మధ్య చిచ్చు రేగుతోంది. అది చివరకు విడాకులకు దారి తీస్తోంది. దేశంలో 30 శాతం వివాహాలు లైంగిక సంతృప్తి లేకపోవడంతోనే విడిపోతున్నాయనేది చేదు నిజం. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినప్పుడు పరస్పరం మాట్లాడుకుంటే సరిపోతుంది. దానికి విడాకుల వరకు వెళ్లడం ఎందుకనే ప్రశ్నలు సైతం వస్తున్నాయి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper