Railway Track: రైల్వే ట్రాక్ పై కంకర రాళ్ళు వేయడానికి కారణం ఏమిటో తెలుసా?

Railway Track: మీరు ఎప్పుడైనా రైల్వే ట్రాక్ గమనించారా? మనం రైల్వే ట్రాక్ ను గమనించినప్పుడు రైల్వే పట్టాల కింద, పట్టాలకు ఇరువైపుల కంకర రాళ్ళు వేయడం చూసే ఉంటారు.ఇలా రైల్వే పట్టాలపై కంకర రాళ్లు ఉండటానికి గల కారణం ఏమిటి? కంకర రాళ్లు రైల్వే పట్టాలపై వేయడం వెనుక ఏదైనా సైన్స్ దాగి ఉందా? ఇలా రైల్వే పట్టాలపై కంకర వేయడానికి గల కారణం ఏమిటి? ఇలా రైల్వే పట్టాలపై కంకర వేయడం వెనుక దాగి […]

Written By: Navya, Updated On : December 9, 2021 2:04 pm
Follow us on

Railway Track: మీరు ఎప్పుడైనా రైల్వే ట్రాక్ గమనించారా? మనం రైల్వే ట్రాక్ ను గమనించినప్పుడు రైల్వే పట్టాల కింద, పట్టాలకు ఇరువైపుల కంకర రాళ్ళు వేయడం చూసే ఉంటారు.ఇలా రైల్వే పట్టాలపై కంకర రాళ్లు ఉండటానికి గల కారణం ఏమిటి? కంకర రాళ్లు రైల్వే పట్టాలపై వేయడం వెనుక ఏదైనా సైన్స్ దాగి ఉందా? ఇలా రైల్వే పట్టాలపై కంకర వేయడానికి గల కారణం ఏమిటి? ఇలా రైల్వే పట్టాలపై కంకర వేయడం వెనుక దాగి ఉన్న సైన్స్ ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

Railway Track

మనం రైల్వే ట్రాక్ గమనించినట్లయితే రెండు లేయర్లు మట్టి తర్వాత కంకర ఆ తర్వాత పొడవైన ఇనుప ప్లేట్లు ఉంటాయి. కంకర రాళ్ళు ఉండటాన్ని బ్లాస్ట్ అని అంటారు. పొడవైన ఇనుప ప్లేట్లను స్లీపర్స్ అని పిలుస్తారు. రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతున్న సమయంలో భూమి కంటే కాస్త ఎత్తులో ఈ రైల్వే ట్రాక్ నిర్మిస్తారు. రైల్వే పట్టాల పై ప్రయాణం చేస్తున్న సమయంలో రైలు బరువు నియంత్రించడానికి స్లీపర్స్, బ్లాస్టర్స్ పనిచేస్తాయి. సైన్స్ ప్రకారం రైల్వే ట్రాక్ కదులుతున్నప్పుడు వైబ్రేషన్స్ ఏర్పడుతాయి.

Also Read: Army Jobs: భారత ఆర్మీలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

ఈ క్రమంలోనే రైల్వే ట్రాక్ పై కంకర రాళ్ళు వేసినప్పుడు ఈ వైబ్రేషన్స్ కారణంగా రైల్వే ట్రాక్ వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది. అందుకే రైల్వే ట్రాక్ పై కంకరను ఎక్కువగా ఉపయోగిస్తారు.అలా కంకర కాకుండా నునుపుగా ఉండే రాళ్లు వేయడం వల్ల రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్ కారణంగా రైల్వే ట్రాక్ వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉండటం వల్ల ప్రమాదాలు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందుకే రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగేటప్పుడు రైల్వే ట్రాక్ కింద పట్టాలకు ఇరువైపులా నునుపుగా ఉండే రాళ్లు కాకుండా కంకర వేయడం జరుగుతుంది.

Also Read: Robbing banks: బ్యాంకులను దోచుకుంటున్న దొంగలు?