Temple Head Shaving Reason: ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించే దేవాలయాలకు వెళ్లినప్పుడు చాలామంది తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. తిరుపతి లాంటి మహా పుణ్యక్షేత్రం వెళ్ళినప్పుడు కుటుంబంతో సహా గుండు చేయించుకుంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లినప్పుడు తలనీలాలను సమర్పించడం వల్ల దైవానుగ్రహం కలుగుతుందని చాలామంది భావిస్తారు. అయితే ఆలయాలకు వెళ్లినప్పుడు గుండు గీసుకోవడం వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. అందుకే పూర్వకాలంలో పెద్దలు ఆలయాలకు వెళ్ళినప్పుడు తలనీలాలు సమర్పించాలని నియమం పెట్టారు. అసలు దేవాలయాలకు వెళ్లినప్పుడు గుండు ఎందుకు గీసుకోవాలి? తలనీలాలు దేవుళ్లకు సమర్పిస్తే నిజంగానే పుణ్యం వస్తుందా? లేదా ఏదైనా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయా?
తలనీలాలు సమర్పించడం వల్ల దైవానుగ్రహం ఉంటుందని భక్తులు భావిస్తారు. మానవ శరీరం ఎన్నో రకాల తప్పులు చేస్తుంది. తెలిసి తెలియక చేసిన కొన్ని పొరపాట్లను శుద్ధి చేసుకోవడానికి తలనీలాలు సమర్పిస్తారని అంటారు. మనిషిలో ఉన్న క్రోదం, అహంకారం వెంట్రుకల రూపంలో ఉంటుందని.. వీటిని దేవుళ్లకు సమర్పించడం వల్ల ఆత్మ శుద్ధి చేసుకున్న వారు అవుతారని కొందరు పండితులు చెబుతారు. అలాగే ప్రశాంతమైన దేవాలయంలో తలనీలాలు సమర్పించడం వల్ల మనశ్శాంతి కలుగుతుందని అంటూ ఉంటారు. పుణ్యక్షేత్రాల్లో జుట్టు తొలగించుకోవడం వల్ల మనిషిలో ఉన్న చెడు ఆలోచనలు వెళ్లిపోతాయని చెబుతారు. అప్పటినుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు అవుతుందని భావిస్తారు.
అయితే ఆలయాల్లో తలనీలాలు సమర్పించడం వెనుక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గుండు గీసుకున్న తర్వాత తలపైన రోమ కూపాలు స్వేచ్ఛగా ఉంటాయి. ఇవి వాతావరణంలో ఉండే స్వచ్ఛతను వెంటనే గ్రహిస్తాయి. ముఖ్యంగా ఆలయాల్లో పరిశుద్ధమైన వాతావరణ ఉంటుంది. ఈ వాతావరణం ను గుండు గీసుకున్న తర్వాత గ్రహించడం ద్వారా మెదడుపై అనుకూలమైన శక్తి ఏర్పడుతుంది. మెదడులో ఉండే నరాలు స్వచ్ఛమైన వాతావరణాన్ని స్వీకరించడం వల్ల నాడీ మండలాలు ఉత్తేజితమవుతాయి. ఫలితంగా రక్తప్రసరణ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా అప్పటివరకు ఉన్న తలనొప్పి కూడా మాయమవుతుంది. తలపై ఉండే మర్మ బిందువులను వెంట్రుకలు కప్పేస్తాయి. దీంతో వాతావరణంలో ఉండే గాలి, సూర్యకిరణాలను తలపై ఉండే మర్మ బిందువులు నేరుగా స్వీకరించవు. గుండు గీసుకున్న తర్వాత ఇవి నేరుగా స్వీకరిస్తాయి. దీంతో ఒక మనిషిలో ఉత్తేజితం ఏర్పడుతుంది.
గుండు గీసుకున్న తర్వాత చెప్పులు లేకుండా దేవాలయంలోకి వెళ్తాం. ఇలాంటి సమయంలో దేవాలయంలోని అయస్కాంతపు శక్తిని శరీరం వెంటనే గ్రహిస్తుంది. గుడిలో వచ్చే శబ్ద తరంగాలను గ్రహించి శరీరంలో ఉండే నరాలను త్వరగా పని చేసేలా చేస్తాయి. అంతేకాకుండా మెదడులో ఉండే కుడి ఎడమ భాగాలను సమతుల్యం చేసి మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తాయి. అప్పటివరకు ఉన్న ఆందోళన తగ్గి ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తుంది. ఇక గుండు గీసుకున్న తర్వాత వచ్చే వెంట్రుకలను స్వచ్ఛమైనవిగా తయారు చేసుకోవచ్చు. వీటికి ఆరోగ్యకరమైన ఆయిల్ లేదా మసాజ్ చేయడం వల్ల అవి నిగనిగా లాడుతాయి. అప్పటివరకు వెంట్రుకల్లో ఉన్న దుమ్ము ధూళి వెళ్లిపోవడం వల్ల తలలో ఇన్ఫెక్షన్ లేకుండా కూడా ఉంటుంది.