Devotional Story: ద్రౌపతిని అవమానించిన కౌరవుల భార్యల పరిస్థితి ఏమైందో తెలుసా?

Devotional Story: పురాణాలలో కౌరవులు పాండవుల కథ గురించి అందరికీ తెలిసిందే.కౌరవులు నిండు సభలో ద్రౌపతికి అవమానిస్తూ ఆమెను వివస్త్రను చేయాలని భావించారు. ఈ క్రమంలోనే దుశ్శాసనుడు ద్రౌపతి చీరను లాగుతూ ఆమెను అవమాన పరచాలని భావించారు. అయితే ద్రౌపతి శ్రీకృష్ణ భక్తురాలు అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ద్రౌపతి శ్రీకృష్ణుడిని వేడుకోవటం వల్ల శ్రీకృష్ణుడు తన మాయతో ద్రౌపదికి అవమానం జరగకుండా చీరలు పంపుతూ ఉంటారు.అయితే ఆమె కోసం శ్రీకృష్ణుడు పంపిన చీరలు ఒకవైపు […]

Written By: Navya, Updated On : January 21, 2022 6:05 pm
Follow us on

Devotional Story: పురాణాలలో కౌరవులు పాండవుల కథ గురించి అందరికీ తెలిసిందే.కౌరవులు నిండు సభలో ద్రౌపతికి అవమానిస్తూ ఆమెను వివస్త్రను చేయాలని భావించారు. ఈ క్రమంలోనే దుశ్శాసనుడు ద్రౌపతి చీరను లాగుతూ ఆమెను అవమాన పరచాలని భావించారు. అయితే ద్రౌపతి శ్రీకృష్ణ భక్తురాలు అనే విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ద్రౌపతి శ్రీకృష్ణుడిని వేడుకోవటం వల్ల శ్రీకృష్ణుడు తన మాయతో ద్రౌపదికి అవమానం జరగకుండా చీరలు పంపుతూ ఉంటారు.అయితే ఆమె కోసం శ్రీకృష్ణుడు పంపిన చీరలు ఒకవైపు పెద్ద పర్వతం వలే ఏర్పడి ఉంటాయి. అయినప్పటికీ దుశ్శాసనుడు తన చీరలో ఉండి చివరికి తను మహాసాధ్వి అని తెలుసుకొని తనకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పారు.

Devotional Story

ఈ క్రమంలోనే ద్రౌపది పాండవులకు విముక్తి కల్పించాలని కోరుతుంది. ఇక అంతటితో ఈ కథ ముగిసింది కానీ ఇందులో తెలియని ఒక పరమాత్మ దాగి ఉంది.ఇలా ద్రౌపది కోసం శ్రీకృష్ణుడు పంపిన చీరలు కొండవలె ఏర్పడి ఉన్నాయి వాటిని ఎవరు తీసుకున్నారు ఆ చీరలు ఏమయ్యాయి అనే విషయానికి వస్తే…కౌరవులు వందమంది అనే విషయం మనకు తెలిసిందే ఈ వంద మంది భార్యలు ఆ చీరను చూసి ముగ్ధులయ్యారు. ఈ క్రమంలోనే 100 మంది భార్యలు వారికి నచ్చిన చీరలు తీసుకొని ధరించారు.

Also Read: కోరికలు నెరవేరాలంటే భగవంతుడిని ఎలా ప్రార్థించాలో తెలుసా?

ఇలా వీరందరూ స్వామివారి మంత్రోచ్చారణతో రూపొందిన చీరలను కట్టుకొని ఒక సభకు వెళ్లారు. అయితే ఆ చీరలు మాయజాలం చీరలు.ఒక నిండు సభలో ఒక మహిళను వివస్త్రను చేసి అవమానించాలని భావించినప్పుడు ఇంత మంది మహిళలు ఉండి కూడా ఏ ఒక్క మహిళ కూడా వచ్చి ఆ అవమానాన్ని ఆపలేదు. అందుకే ఆ అవమానాన్ని వీరికి కల్పించాలని భగవంతుడు సంకల్పించాడు. అందుకే తన మంత్రం పనిచేయాలని కృష్ణుడు ఆదేశిస్తే అలా నిండుసభలో కౌరవుల భార్యలకు అవమానం జరిగిందని పండితులు తెలియజేశారు.ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక మహిళ పట్ల చెడు భావన చెడు ఉద్దేశంతో ఉంటారో అలాంటి వారికే చెడు జరుగుతుందనీ తెలిపే సారాంశమే ఈ కథ అని స్వామి చిన్న జీయర్ స్వామీజీ తెలియజేశారు.

Also Read: ఈ పది మూఢనమ్మకాల వెనుక శాస్త్రీయ కోణం తెలుసా?