https://oktelugu.com/

AP Express Train: ఏపీ ఎక్స్ ప్రెస్ ఎందుకు అంటుకుంది? మంటలు ఎందుకు వ్యాపించాయి.?

AP Express Train: ఆంధ్రా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్ ప్రెస్ రైలును చాలా మంది వినే ఉంటారు. ఇంకా చాలా మంది ప్రయాణించి కూడా ఉంటారు. అయితే తాజాగా ఈ రైలును అగ్ని వెంటాడు. ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలో దాదాపు 1 గంట పాటు రైలును అధికారులు నిలిపివేశారు. ఏపీ ఎక్స్ ప్రెస్ ఎస్6 బోగీలో ఒక్కసారిగా […]

Written By:
  • NARESH
  • , Updated On : January 21, 2022 / 03:28 PM IST
    Follow us on

    AP Express Train: ఆంధ్రా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే ఏపీ ఎక్స్ ప్రెస్ రైలును చాలా మంది వినే ఉంటారు. ఇంకా చాలా మంది ప్రయాణించి కూడా ఉంటారు. అయితే తాజాగా ఈ రైలును అగ్ని వెంటాడు. ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

    వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలో దాదాపు 1 గంట పాటు రైలును అధికారులు నిలిపివేశారు. ఏపీ ఎక్స్ ప్రెస్ ఎస్6 బోగీలో ఒక్కసారిగా పొగలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. రైల్వే స్టేషన్ లోని ప్రయాణికులు కూడా భయంతో పరుగులు పెట్టారు

    రైలు బ్రేకులు జాం కావడంతో పొగలు వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. నెక్కొండలోనే రైలును నిలిపివేసి తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికులు రైలు ఆగిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై విచారణకు రైల్వే అధికారులు ఆదేశించారు.

    కాగా ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులందరూ సేఫ్ గా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

    Tags