
Foods Increase Romance : ఈ రోజుల్లో రొమాన్స్ ప్రభావం తగ్గుతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో అంతా యాంత్రికంగా మారుతోంది. ఈ నేపథ్యంలో రొమాన్స్ పై అంతగా శ్రద్ధ చూపలేకపోతున్నారు. కెరీర్ పైనే ఫోకస్ పెడుతున్నారు. జీవితంలో ఎదిగేందుకు కష్టపడుతున్నారు కానీ జీవిత భాగస్వామిని సుఖపెట్టే పనికి మాత్రం వెనకాడుతున్నారు. దీంతో వారిలో రతికి సంబంధించిన కోరికలతో రగిలిపోవాల్సి వస్తోంది. రతిని కూడా పట్టించుకోవాలి. రొమాన్స్ లేకపోతే జీవితమే వ్యర్థంగా మారిపోవడం ఖాయం. రొమాన్స్ పెరగడానికి కావాల్సిన పదార్థాలు తీసుకుని జీవితాన్ని నందనవనం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

సోంపు
మనం అన్నం తిన్నాక అది జీర్ణం కావడానికి సోంపు నోట్లో వేసుకుంటాం. దీంతో తిన్నది త్వరగా జీర్ణం కావడమే కాకుండా లైంగిక సామర్థ్యం పెరిగేందుకు దోహదపడుతుంది. సోంపు తిన్న వారికి లైంగిక ఉద్ధీపనలు కలగడం సహజమే. అల్లం టీ తాగితే కూడా మంచి ఫలితాలు వస్తాయి. దీంతో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది.సంతాన సమస్యలు తొలగిపోతాయి.

మునక్కాయలు
లైంగిక కోరికలు రగలడానికి మునక్కాయలు బాగా ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల ఎంతో శక్తి పెరుగుతుంది. దీంతో లోపల జింక్ ఉండటం వల్ల రొమాన్స్ పై మూడ్ ఎక్కువ అవుతుంది. ఫలితంగా లైంగిక సామర్థ్యం పెరిగి జీవిత భాగస్వామిని సుఖపెట్టే వరకు శక్తి ఉంటుంది. దీంతో అంగస్తంభన సమస్య కూడా దూరం అవుతుంది. ఇలా మునక్కాయలు మన దేహానికి మేలు చేస్తాయి.

వెల్లుల్లి
వెల్లుల్లిలో కూడా లైంగిక ఉద్ధీపన లక్షణాలు ఉన్నాయి. దీంతో వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఇంకా అనేక అనారోగ్యాలకు చెక్ పెడుతున్నాయి. ఇంగువ, బెల్లం తీసుకోవడం వల్ల కూడా లైంగిక పటుత్వం రెట్టింపు అవుతుంది. ఇలా కొన్ని ఆహారాలు తీసుకుంటే మనకు మంచి లైంగిక సామర్థ్యం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

గుమ్మడి గింజలు
గుమ్మడి గింజల్లో కూడా మంచి ప్రొటీన్లు ఉన్నాయి. వీటిని రాత్రి పూట పానీయాలు, ఆహారాల రూపంలో తీసుకోవడం వల్ల రొమాన్స్ పై పట్టు పెరుగుతుంది. లైంగిక సామర్థ్యం పెంచుకునేందుకు పలు ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల జంటల్లో లైంగిక సమస్యలకు చెక్ పెట్టే అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల మనకు మంచి అనుభూతి పొందవచ్చు.

అరటిపండు
అరటిపండు తినడం వల్ల కూడా లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. అంగస్తంభన సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇలా లైంగిక పటుత్వం పెరిగేందుకు అవసరమయ్యే ఆహారాలను తీసుకుని మన లైంగిక సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.