Heart Attack: పూర్వం రోజుల్లో వృద్ధాప్యంలో వచ్చే గుండె పోటు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తోంది. దీనికి మన జీవన శైలియే కారణం. ఆహార అలవాట్లలో నిబద్ధత పాటించకపోవడంతో హృదయ సంబంధ రోగాలు వస్తున్నాయి. ఫలితంగా వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల ముప్పు పొంచి ఉంటోంది. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ విధమైన ఆహార అలవాట్లు పాటించాలి తదితర విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

రక్తపోటు అదుపులో లేకుంటే కూడా గుండె జబ్బుల ప్రమాదం ఉంటుంది. రక్త ప్రసరణ నిలిచిపోతే గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. బీపీని నియంత్రణలో ఉంచుకోకపోతే హృద్రోగ సమస్యలు చుట్టుముట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుండె జబ్బుల ముప్పు వస్తుంది. బరువు కూడా అదుపులో ఉంచుకోవాలి. అధిక బరువుతో అనర్థాలే ఎక్కువ. అధిక బరువుతో గుండె జబ్బులు వచ్చే వీలుంటుంది. మితాహారం తీసుకుని బరువును నియంత్రణలో ఉంచుకోకపోతే నష్టమే ఎక్కువ వస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
శరీరంలో పేరుకుపోయే కొవ్వుతో కూడా గుండె జబ్బు వస్తుంది. రక్తనాళాల్లో చెడు కొవ్వు అడ్డు పడితే గుండె జబ్బు ముప్పు వస్తుంది. రక్త ప్రసరణకు అడ్డుకు చెడు కొవ్వుగా పిలుచుకునే ఎల్ డీఎల్ కొవ్వుతో మన శరీరానికి అరిష్టమే. జంక్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ తగ్గించుకుంటేనే ఫలితం ఉంటుంది. మధుమేహంతో కూడా నష్టమే. షుగర్ ను కూడా అదుపులో ఉంచుకుంటేనే ప్రయోజనం. మధుమేహం ఉన్నట్లయితే ఔషధాలు, వంటింటి చిట్కాలతో కంట్రోల్ లో ఉంచుకోకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి.

ధూమపానం కూడా గుండె జబ్బులకు దారి తీస్తుంది. పొగ తాగే అలవాటు ఉన్న వారిలో ప్రతి ఐదు మరణాల్లో ఒకటి గుండెపోటు కావడం గమనార్హం. పొగ తాగితే ఊపిరితిత్తులు పాడయిపోతాయి. గుండెకు చేటు చేస్తుంది. వీలైనంత వరకు పొగతాగడం అలవాటు మానుకుంటే మంచిది. మద్యపానం కూడా మంచి అలవాటు కాదు. మందు తాగితే కాలేయం పాడవుతుంది. మద్యం తాగితే గుండె జబ్బు ముప్పు ఏర్పడుతుందని చెబుతున్నారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే కష్టాలు ఉండవు. కనీసం రోజుకు గంటైనా నడక సాగిస్తే మంచిది.