Left Side Sleeping: ఆకలి రుచెరగదు.. నిద్ర చోటెరగదు.. పూట కూల్లమ్మ పుణ్యమెరగదని సామెత. కొందరికి వెన్నంటుకుంటేనే కన్నంటుకుంటుంది. మరికొందరికి ఎంతకీ నిద్ర పట్టదు. కొందరేమో అటు పడుకుంటే ఇట్టే గుర్రు కొట్టేస్తారు. చాలా మందికి నిద్ర అంత తొందరగా పట్టదు. అటు తిరిగి ఇటు తిరిగి పడుకుంటూ ఎప్పుడో అర్థరాత్రికి కాని నిద్రపోరు. నిద్ర పట్టాలంటే కూడా కొన్ని చిట్కాలు పాటించాల్సిందేనని వైద్యులు చెబుతుంటారు. ఎంత తొందరగా డిన్నర్ ముగిస్తే అంత బాగా నిద్ర వస్తుందని తెలియజేస్తారు. అందుకే మనం డిన్నర్ ను సాధ్యమైనంత త్వరగా ముగించేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే మన ఆరోగ్యం మీద పెను ప్రభావం పడుతుంది.

కంటి నిండా నిద్ర లేకపోతే పొద్దంతా హాయిగా పని చేసుకోవడం వీలు కాదు. బద్దకంగా ఉంటుంది. ఒళ్లంతా ఒకటే విరుపులు వస్తాయి. దీంతో ఏ పని చేయాలన్నా మనసొప్పదు. మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. నిద్ర లేకపోతే ఆరోగ్యం సహకరించదు. అందుకే నిద్ర పోవడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కడుపు నిండా తిండి కంటి నిద్ర నిద్రతోనే ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. అలాంటి నిద్రను నిర్లక్ష్యం చేస్తే అది మన జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది.
Also Read: Krishna Bhagwan: కృష్ణభగవాన్ రాకతో జబర్దస్త్ కళ మారుతుందా?
నిద్ర పోయేటప్పుడు ఎటు వైపు తిరిగి పడుకుంటే మంచిదని అడుగుతుంటారు. కొందరేమో కుడివైపుకు తిరిగి పడుతకుంటారు. మరికొందరేమో ఎడమ వైపు తిరిగి పడుకుంటారు. ఇంకొందరేమో వెల్లకిలా పడుకుంటారు. ఎవరికి తోచిన విధంగా వారు పడుకోవడం చూస్తుంటాం. వైద్యులు మాత్రం ఎడమ వైపుకు తిరిగి పడుకుంటే మంచిదని చెబుతున్నారు. ఎడమ పక్కకు తిరిగి పడుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుందట. దీంతో ఉదయాన్నే మంచి ఉత్సాహంతో లేచి పనులు చేసుకోవడం చేస్తుంటామన వివరిస్తున్నారు.

ఎడమ పక్కకు తిరిగి పడుకుంటే రక్తం కూడా శుద్ధి అవుతుంది. అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసేందుకు ఇదే ఉత్తమమైన మార్గమని సూచిస్తున్నారు. వైద్యులు సూచించిన సలహాతో ఎడమ వైపుకే తిరిగి పడుకుంటే ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయేందుకు కూడా వీలవుతుంది. రెట్టింపు ఉత్సాహం వస్తుంది. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయని తెలియడంతో ఎక్కువ మంది ఎడమ వైపు తిరిగి పడుకునేందుకు ఇష్టపడుతున్నారని చెబుతున్నారు.