Krishna Bhagwan: జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. తెలుగు ప్రేక్షకులనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న వారిని ఉర్రూతలూగించిన కార్యక్రమం. దీంతో అందరు జబర్దస్త్ కు ఆకర్షితులైన మాట వాస్తవమే. మొదటి జబర్దస్త్ కు ఇప్పటి షోకు ఎంతో తేడా ఉంది. అప్పుడు నాగబాబు, రోజాలు జడ్జిలుగా అనసూయ వ్యాఖ్యాతగా కళ తీసుకొచ్చారు. వారి కోసమే అయినా షోను చూసేవారు. వారి జోడి అలా ఉండేది. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు జబర్దస్త్ షో కళ తప్పింది. సీనియర్ టీం లీడర్లు బయటకు వెళ్లిపోయారు. దీంతో జూనియర్లకు బాధ్యతలు అప్పగించినా వారు తమదైన శైలిలో రాణించడం లేదు. దీంతో జబర్దస్త్ పట్టు తప్పిపోతోంది.

దీంతో జబర్దస్త్ రోజురోజుకు గతి తప్పుతోంది. కామెడీ కాకుండా వేరే దారిలో వెళ్తుందోననే సందేహాలు వస్తున్నాయి. బూతులు వల్లిస్తూ పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో జబర్దస్త్ పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జడ్జిల పాత్రపై కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. రోజా, నాగబాబు ఉన్నప్పుడు షో లో ఉన్నప్పుడు ఉన్న కామెడీ ప్రస్తుతం కానరావడం లేదు. వారి హయాంలో టీం లీడర్లు, కంటెస్టెంట్లు సమన్వయంతో స్కిట్లు చేశారు. కానీ ప్రస్తుతం ఆ ధ్యాస వారిలో కనిపించడం లేదు. దీంతోనే జబర్దస్త్ లో హాస్యం కానరావడం లేదని చెబుతున్నారు. దీంతోనే జబర్దస్త్ షో నవ్వులు పండించే బదులు నవ్వుల పాలై అవుతుందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జబర్దస్త్ జడ్జిగా సీనియర్ కమెడియన్ కృష్ణభగవాన్ ను తీసుకొచ్చింది. సినిమాల్లో కూడా గోదావరి యాసలో అందరిని నవ్వించే కృష్ణభగవాన్ ను జడ్జిగా తీసుకురావడంతో మల్లెమాల మరో మంచిపని చేసిందని తెలుస్తోంది. జడ్జిగా ఉండేవారికి కాస్త కామన్ సెన్స్ కూడా ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారు. అది రోజా, నాగబాబుకు ఉండేది. వీరికి తోడు యాంకర్ అనసూయ తోడుండేది. కానీ ఇప్పుడు ముగ్గురు జబర్దస్త్ కు దూరమయ్యారు. అనసూయ సినిమాల్లో బిజీగా ఉంది.

కృష్ణ భగవాన్ రాకతో జబర్దస్త్ కు మునుపటి కళ వస్తుందని ఆశిస్తున్నారు. కృష్ణ భగవాన్ రాకతో జబర్దస్త్ కు పూర్వదశ వస్తుందని ఆశిస్తున్నారు. కామెడీ పండించడంలో ఆర్టిస్టులకు దిశానిర్దేశం చేసి వారిలో ఆత్మస్థైర్యం నింపి వారిని హాస్యం పండించడంలో తోడ్పాటు అందించే కృష్ణ భగవాన్ లాంటి వారి రాక జబర్దస్త్ కు మేలు జరుగుతుందని చూస్తున్నారు. ఇకనైనా జబర్దస్త్ కు కామెడీ వస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మొత్తానికి కృష్ణభగవాన్ రాక జబర్దస్త్ కు లాభం చేకూరుస్తుందని అందరి ఆశ.
Also Read:Liger Twitter Review: ‘లైగర్’ ట్విట్టర్ రివ్యూ: సినిమా ఎలా ఉందంటే?
[…] […]