Hair Health: తెల్ల జుట్టు నల్లగా మారడానికి ఇంటి చిట్కాలు.. సింపుల్ గా మార్చేసుకోండి

బీట్‌రూట్, క్యారెట్ లు అందరి వంటింట్లో ఉంటున్నాయి.. వీటిని వాడడం వల్ల జుట్టుకి మంచి రంగు, పోషణ లభిస్తుంది. దీనికోసం బీట్‌రూట్, క్యారెట్స్‌ని నీటిలో మెత్తగా ఉడికించి.. చల్లారిన తర్వాత ఆ రెండింటిని పేస్టులా చేసుకోవాలి.

Written By: Swathi, Updated On : June 14, 2024 3:40 pm

Hair Health

Follow us on

Hair Health: వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు అందరినీ వేధిస్తుంది. చిన్నా పెద్ద అంటూ అందరికి ఈ తెల్ల జుట్టు వచ్చేస్తుంది. దీనికి కారణం లైఫ్‌స్టైల్ చేంజెస్, కెమికల్స్ ఉండే ప్రోడక్ట్స్ వాడటం అంటున్నారు నిపుణులు. ఒత్తిడి, పోషకాహార లోపం, పొల్యూషన్ ఇలా చాలా కారణాలే ఈ జాబితాలో ఉన్నాయి. మరి వీటిని దూరం చేయడానికి కెమికల్స్ ఉండే కలర్స్ ను వేయకుండా ఇంట్లోనే నేచురల్ రెమెడీస్ ఉపయోగించాలి. అందుకే ఈ రెమెడీ మీకోసం.

బీట్‌రూట్, క్యారెట్ లు అందరి వంటింట్లో ఉంటున్నాయి.. వీటిని వాడడం వల్ల జుట్టుకి మంచి రంగు, పోషణ లభిస్తుంది. దీనికోసం బీట్‌రూట్, క్యారెట్స్‌ని నీటిలో మెత్తగా ఉడికించి.. చల్లారిన తర్వాత ఆ రెండింటిని పేస్టులా చేసుకోవాలి. తర్వాత దీనిని జుట్టుకి అప్లై చేసుకొని ఆరిన తర్వాత క్లీన్ చేసుకోండి.

హెన్నాతో వల్ల కూడా జుట్టుకు ఎన్నో లాభాలున్నాయి. జుట్టు రంగును నల్లగా మారుస్తుంది. గోరువెచ్చని నీటిలో హెన్నా పౌడర్ కలిపాలి. అయితే పొడి జుట్టు ఉన్నవారు పెరుగుని కలపుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. దీనిని పేస్టులా చేసి జుట్టుకు అప్లే చేసుకోవాలి. అయితే మూడు గంటల తర్వాత దీనిని క్లీన్ చేసుకోవాలి. ఇది గ్రే హెయిర్ సమస్యని కూడా దూరం చేస్తుంది. అయితే హెన్నా అనగానే షాపులోది కాకుండా మీరే ఇంట్లో తయారు చేసుకోవడం బెటర్.

జుట్టు, చర్మానికి మేలు చేస్తాయి బంగాళదుంపలు. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. తెల్లజుట్టుని దూరం చేయడానికి కూడా బంగాళాదుంపల్ని వాడవచ్చు. దీని కోసం బంగాళాదుంప తొక్కల్ని నీటిలో ఉడికించి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ కు పెరుగు కలపాలి. ఈ పేస్టును జుట్టుకు అప్లే చేసి ఓ అరగంట అలాగే ఉంచుకోవాలి. తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఉసిరిని నీటిలో వేసి ఉడికించి.. దీనిని తర్వాత మిక్సీలో వేసి పేస్టులా చేసుకోండి. తర్వాత ఈ ప్యాక్‌ని హెయిర్ ప్యాక్ మాదిరి వేసుకోండి. గంట తర్వాత జుట్టుని ప్లెయిన్ వాటర్‌తో క్లీన్ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

ఈ సమాచారం కేవలం ప్రాథమిక అవగాహన, సోషల్ మీడియాలో ఉన్న సమాచారం మేరకు మాత్రమే అందించడం జరుగుతుంది. దీన్ని ఒకే తెలుగు నిర్ధారించదు.