Cloves Benefits: మన వంటింట్లోనే ఎన్నో రకాల ఔషధాలు దాగి ఉన్నాయి. శాఖాహారమైనా మాంసాహారమైనా వంటల్లో లవంగాలు ఉంటే వాటి ఘాటు వేరే ఉంటుంది. కూరలకు రుచులు తీసుకురావడంలో లవంగాల పాత్ర ఘనమైందే. దీంతో పసందైన రుచులు దక్కాలంటే లవంగాలను వాడుకోవాల్సిందే. ఇందులో నోటి దుర్వాసనను పోగొట్టే గుణం ఉంటుంది. సౌందర్య సాధనాల్లో కూడా వీటిని వాడతారు. ఔషధాల తయారీలో వీటిని ఉపయోగిస్తారు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో పాటు మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో ఉండటం గమనార్హం. ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో అంటు వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో కూడా ఇవి తోడ్పడతాయి.

రోజు ఉదయం సాయంత్రం పూట పడుకునే ముందు రెండు లవంగాలను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీరు తాగడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదటి దశలో ఉన్న రోజుల్లో లవంగాలు తీసుకుంటే క్యాన్సర్ బారి నుంచి రక్షించుకోవచ్చు. లవంగాలకు క్యాన్సర్ తో పోరాడే శక్తి ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు రెండు లవంగాలు తీసుకోవడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం వాంతులు, వికారం వంటివి రాకుండా సాయపడతాయి.
వర్షంలో తడవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు దరిచేరతాయి. అలాంటప్పుడు మూడు నాలుగు లవంగాలు తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపిస్తాయి. మధుమేహం, రక్తపోటు వంటి రోగాలతో బాధపడేవారు లవంగాల కషాయాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కాలయంతో వివిధ రకాల చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను కరిగిస్తుంది. మెటబాలిజాన్ని మెరుగుపరచి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

లవంగాల్లో ఉండే రసాయనాలు ఎముకలకు బలం చేకూరుస్తాయి. కీళ్లనొప్పులు, ఎముకలు గుల్లబారడం వంటి సమస్యలు రాకుండా చేస్తాయి. గ్యాస్, అజీర్తి సమస్యలు నిరోధిస్తాయి. టూత్ పేస్టులలో కూడా లవంగాలు వాడతారు. వీటితో దంత సమస్యలు రావు. నోటిదుర్వాసనను రాకుండా చేస్తాయి. తలనొప్పిని తగ్గిస్తాయి. మరిగించిన గోరువెచ్చని నీటిలో వీటిని చేర్చుకుని పుక్కిలిస్తే గొంతు నొప్పి రాకుండా పోతుంది. ఇలా లవంగాల వల్ల ఎన్నో దీర్ఘకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయనే సంగతి తెలుసుకుని వాడుకుంటే మంచిది.