Inaya Sultana Proposes Sohel: బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా మంచి క్రేజ్ మరియు పాపులారిటీ దక్కించుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సోహైల్ అనే చెప్పాలి..తన చలాకి మాటలతో, చురుకుదనం తో ఆయన కోట్లాది మంది అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాడు..అలాంటి వారిలో బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ ఇనాయ సుల్తానా కూడా ఒకరు..సీజన్ 6 ద్వారా ఈమె ఎలాంటి క్రేజ్ ని దక్కించుకుందో అందరికి తెలిసిందే.

మొదటి ఎపిసోడ్ నుండి చివరి వరకు ఆమె ఆడపులి లాగ మగవాళ్ళతో తలపడి టాస్కులు ఆడింది..టైటిల్ విన్నర్ కూడా అవుతుందని అందరూ అనుకున్నారు కానీ, చివరికి టాప్ 6 కంటెస్టెంట్ గానే బయటకి వచ్చింది..ఇనాయ ఎలిమినేషన్ బిగ్ బాస్ హిస్టరీ లోనే అతి పెద్ద అన్యాయం అని సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రెండ్ కూడా జరిగింది..ఇది ఇలా ఉండగా ఆమె కి సీజన్ 4 కంటెస్టెంట్ సోహైల్ అంటే ఎంత లవ్ అనేది మన అందరికీ తెలిసిందే.

ఆమె ప్రేమని గుర్తించి సోహైల్ సీజన్ 6 లో ఒకసారి ఆమెకోసం వస్తాడు కూడా..అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఇనాయ సోహైల్ కి మరో ప్రొపోజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఆ వీడియో లో ఆమె మాట్లాడుతూ ‘ఈరోజు నా మనసులో ఉన్న మాట ని నీకు చెప్పాలనుకుంటున్న సోహైల్..ప్రేమ ఉన్నంత వరకు కాదు..నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను..నువ్వంటే నాకు చాలా ఇష్టం..నీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటాను’ అని చెప్పుకొచ్చింది..మరి సోహైల్ ఇనాయ కి ఓకే చెప్తాడో లేదో చూడాలి..సోహైల్ హీరో గా నటిస్తున్న ‘లక్కీ లక్ష్మణ్’ చిత్రం ఈ వారం విడుదల కాబోతుంది..ఈ సినిమా ప్రొమోషన్స్ లో సోహైల్ ఫుల్ బిజీ గా ఉంటున్నాడు.