Bigg Boss 6 Tittle Winner: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఎపిసోడ్ నుండి నేటి వరకు టాస్కుల దగ్గర నుండి ఎంటర్టైన్మెంట్ వరుకు నూటికి నూరు శాతం న్యాయం చేసిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది రేవంత్ మాత్రమే..అంతే కాకుండా కంటెస్టెంట్స్ అందరితో కలిసిపోయిన ఏకైక వ్యక్తి కూడా రేవంత్ ఒక్కడే..అందుకే నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా అందరికంటే భారీ మార్జిన్ తో అతనికి ఓటింగ్ వస్తుండేది.

దానికి తోడు ఈ సీజన్ లో రేవంత్ తప్ప..మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ప్రేక్షకులకు పెద్దగా ముఖ పరిచయం లేని వాళ్ళు..ఫైమా మరియు చంటి వంటి వారు బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్నవాళ్లే అయినా..రేవంత్ తో పోలిస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ..అది రేవంత్ కి బాగా కలిసొచ్చిన అంశాలలో ఒకటి..సోషల్ మీడియా లో వచ్చే పోలింగ్ ని బట్టి టైటిల్ విన్నర్ అతనే అని అందరూ బలంగా ఫిక్స్ అయిపోయారు కూడా.
కానీ గడిచిన కొద్ది వారాల నుండి రేవంత్ స్థానానికి ఇనాయ మరియు రోహిత్ పోటీకి వచ్చారు..వీళ్లిద్దరికీ ఓటింగ్ రేవంత్ తో చాలా క్లోజ్ గా ఉంటూ వచ్చింది..అయితే ఈమధ్య కాలం లో రోహిత్ పై ప్రేక్షకుల్లో సానుభూతి బాగా పెరిగిపోయింది..మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే రోహిత్ చాలా కూల్ గా ఉండడం..నిజాయితీగా టాస్కులు ఆడడం వంటివి అందరికి బాగా నచ్చింది..అందుకే ఆయనకి ఓటింగ్ అమాంతం పెరిగిపోయింది.

ఈ వారం జరిగిన ఓటింగ్ లో రేవంత్ మరియు రోహిత్ మధ్య వచ్చిన ఓట్ల తేడా చాలా స్వల్పం..వచ్చే వారం ఆయన రేవంత్ ని క్రాస్ చేసి నెంబర్ 1 స్థానం లో కొనసాగొచ్చు ..టైటిల్ గెలవొచ్చు అనే టాక్ కూడా ఉంది..ఇన్ని రోజులు ట్విస్టులతో ఆడుకున్న బిగ్ బాస్..తన ఆటని ఈసారి చివరి ఎపిసోడ్ చివరి నిమిషం వరుకు కొనసాగించబోతున్నాడు..మరి టైటిల్ విన్నర్ ఎవరికీ దక్కుతుందో తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.