Tea Benefits: ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. నరాల బలహీనత, కొలెస్ట్రాల్, వాత రోగాలు, అధిక బరువు, మూత్ర పిండాల సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అజీర్తి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి బాధిస్తున్నాయి. వీటి నుంచి బయట పడటానికి ఓ చిట్కా ఉంది. దీన్ని పాటిస్తే మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. దీని కోసం మనం సోంపు, ఆవాలు ఉపయోగించాలి.
ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీరు పోయాలి. అందులో రెండు టీ స్పూన్ల సోంపు గింజలు వేసి వేడి చేసుకోవాలి. నీళ్లు మరిగాక అందులో అర టీ స్పూన్ ఆవాలు వేసి మళ్లీ ఐదు నిమిషాలు మరిగించాలి. ఒక గ్లాసు నీళ్లు అర గ్లాసు అయ్యే వరకు మరిగించిన తరువాత ఆ నీటిని వడకట్టుకుని గ్లాసులోకి తీసుకోవాలి. వడకట్టిన ఆవాలు, సోంపు గింజలను పడేయకుండా అలాగే మళ్లీ టీ లా తయారు చేసుకోవచ్చు.
ఈ టీని రోజు ఉదయం పరగడుపున తాగాలి. సాయంత్రం 5 గంటల సమయంలో సేవించాలి. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య లేకుండా పోతుంది. మూత్రపిండాల సమస్యలతో చాలా మంది సతమతమవుతున్నారు. ఈ టీ తాగడం వల్ల ఒత్తిడి లేకుండా పోతుంది. కంటి చూపుకు కూడా మంచిది. స్త్రీలు తాగితే హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి.
శరీరంలో కొవ్వు పేరుకోకుండా చేయడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల, కండరాల నొప్పులు దూరమవుతాయి. ఈ టీ తాగడం వల్ల ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇలా ఇన్ని రకాల మేలైన ప్రయోజనాలు ఉండటంతో ఈ టీ తీసుకోవడం వల్ల మనకు సమస్యలు లేకుండా పోతాయి.
