Adipurush Hanuman: ఆదిపురుష్ మూవీ స్వయంగా చూడనున్న రామదూత హనుమాన్… ప్రతి థియేటర్స్ లో ఒక సీటు కేటాయింపు!

రాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ ఉంటాడనేది నమ్మకమట. కాబట్టి ఆదిపురుష్ థియేటర్స్ కి హనుమంతుడు ఖచ్చితంగా వస్తాడట. మరి హనుమంతుడు నిల్చొని సినిమా చూస్తే ఈ బాగుంటుంది.

Written By: Shiva, Updated On : June 6, 2023 12:13 pm

Adipurush Hanuman

Follow us on

Adipurush Hanuman: సినిమాను మార్కెట్ చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆదిపురుష్ మూవీ రామగాథ కావడంతో భక్తుల నమ్మకాలను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఆదిపురుష్ టీమ్ తీసుకున్న ఓ నిర్ణయం చాలా విడ్డూరంగా ఉంది. నమ్మకానికి మూఢనమ్మకాని వ్యత్యాసం ఉంటుంది. దేవుడు ఉన్నాడని నమ్మడంలో తప్పు లేదు. కానీ ఆయన పేరిట జనాలను పిచ్చోళ్లను చేయడం సబబు కాదు. ఆదిపురుష్ సినిమాను మతం పేరున అమ్ముతున్నారు. మొదటి నుండి టీం అదే చేస్తుంది. ఆదిపురుష్ టీజర్ రామజన్మభూమి అయోధ్యలో విడుదల చేశారు.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ డివోషనల్ సిటీ తిరుపతిలో నిర్వహిస్తున్నారు. ఇదంతా దేశంలో మెజారిటీ వర్గంగా ఉన్న హిందువులను ఆకర్షించేందుకే. ప్రతి ఒక్క హిందువు ఆదిపురుష్ మూవీ చూస్తే చాలు బాక్సాఫీజు షేక్ అవుతుంది. ఆదిపురుష్ కి లాభాలు వస్తాయి. భక్తుల మనోభావాలను వాడుకొని సినిమా టికెట్స్ అమ్ముకోవాలని ఆదిపురుష్ టీమ్ ఊహించని పరిణామాలకు పాల్పడుతుంది. అందులో భాగంగా ఆదిపురుష్ ఆడుతున్న ప్రతి థియేటర్లో ఒక సీటు ఖాళీగా ఉంచనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

రాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ ఉంటాడనేది నమ్మకమట. కాబట్టి ఆదిపురుష్ థియేటర్స్ కి హనుమంతుడు ఖచ్చితంగా వస్తాడట. మరి హనుమంతుడు నిల్చొని సినిమా చూస్తే ఈ బాగుంటుంది. అందుకే ఆయన కోసం ఓ సీటు ఖాళీగా ఉంచుతున్నారట. అంటే ఆదిపురుష్ టికెట్స్ బుకింగ్స్ నుండి ఒక సీటు తొలగిస్తారట. ఆ విధంగా హనుమంతుడుకి ఆదిపురుష్ థియేటర్స్ లో ఒక సీటు ఖాళీగా కనిపిస్తుందట. అంటే ఆ సీటులో హనుమంతుడు కూర్చొని సినిమా చూస్తున్నాడని అర్థం చేసుకోవాలి.

సినిమా ప్రమోషన్ కోసం యూనిట్ తీసుకున్న ఈ నిర్ణయం ఒకింత విడ్డూరంగా ఉంది. కొందరు పెదవి విరుస్తున్నారు. మరికొందరు మాత్రం అద్భుతం. ఈ నిర్ణయం బాగుందని కొనియాడుతున్నారు. ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా అల్టిమేట్ గా సినిమా బాగుంటేనే ప్రేక్షకులు చూస్తారు. లేదంటే థియేటర్స్ లో సీట్లన్నీ వానర సైన్యం కోసం ప్రేక్షకులు వదిలేస్తారు. అప్పుడు హనుమంతుడేంటి…. రామాయణ పాత్రలన్నీ హ్యాపీగా ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా చూడొచ్చు…