Bigg Boss 8 Telugu: నేడు బిగ్ బాస్ హౌస్ లోకి బెజవాడ బేబక్క తో కలిసి జంటగా హౌస్ లోకి అడుగుపెట్టిన శేఖర్ బాషా ఇటీవల కాలంలో హౌస్ లోకి అడుగుపెట్టకముందు నుండే బాగా ఫేమస్ అయిన సంగతి అందరికి తెలిసిందే. హీరో రాజ్ తరుణ్ – లావణ్య వ్యవహారంలో తనకి ఏమాత్రం సంబంధం లేకపోయినా కూడా రాజ్ తరుణ్ తరుపున నిలబడి మీడియా లో ఇతను చేసిన హంగామాని అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు. రాజ్ తరుణ్, లావణ్యలలో ఎవరిది తప్పు అనే పక్కన పెడితే, ఈ వ్యవహారంలో శేఖర్ బాషా చాలా నిజాయితీగా ఉన్నాడు అనేది అందరికి అర్థం అయ్యింది. అతని మాట తీరుకి సమాధానం చెప్పుకోలేక లావణ్య లైవ్ డిబేట్ లో అతనిపై చెప్పులు విసిరినా ఘటన అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక విధంగా చెప్పాలంటే శేఖర్ బాషా సీన్ లోకి రావడం వల్ల లావణ్య బాగా నెగటివ్ అయిపోయింది.
అలా తన మాటలతో ఎవరినైనా లాక్ చేయగలిగే సత్తా ఉన్న శేఖర్ బాషాతో కంటెస్టెంట్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ఇతను టైటిల్ కూడా కొట్టే అవకాశాలు ఉన్నాయి. హౌస్ లోకి అడుగుపెట్టే ముందే ఆయన నాగార్జున తో మాట్లాడిన ఈ మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘నేను ఎవరితో గొడవలు పెట్టుకోను..కానీ నాతో గొడవలు పెట్టుకోవాలని చూస్తే కప్పు పట్టుకొని పోతా’ అంటూ ఆయన మాట్లాడిన మాటలకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే మొదటి టాస్కులో శేఖర్ బాషా గెలవడం గమనార్హం. దీనిని బట్టి ఇతను మాట తీరుతో నెగ్గగలడు, టాస్కులు ఆడి గెలవగలడు అని అర్థం అవుతుంది. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టకముందు అసలు శేఖర్ బాషా వృత్తి ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇతను చాలా సంవత్సరాల నుండే రేడియో జాకీ గా పని చేస్తున్నాడు. ఇతను ఎంత రేడియో జాకీ అంటే, ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా 18 సార్లు బెస్ట్ రేడియో జాకీ గా అవార్డు పొందాడు.
ఇప్పటి వరకు ఇండియా లో ఈ రికార్డు ని ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు. అలా రేడియో జాకీ గా ఒక వెలుగు వెలుగుతూనే జెమినీ మ్యూజిక్ లో పలు షోస్ కి యాంకర్ గా కూడా వ్యవహరించాడు. అంతే కాకుండా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ‘వెల్కమ్ ఒబామా’ చిత్రం లో ఒక చిన్న క్యారక్టర్ కూడా చేసాడు. నటుడిగా మాత్రమే కాదు, ఈయన ‘వెతికా నేను నా ఇష్టంగా’ అనే సినిమాతో డైరెక్టర్ గా కూడా మారాడు. ఇలా ఎంతో ప్రతిభ ఉన్న ఈ శేఖర్ బాషా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో స్ట్రాంగ్ గా అనిపిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఈయన ఆట ఎలా ఉండబోతుందో చూడాలి.