
Health Tips: ఎండాకాలంలో ఫ్రిజ్ ల వినియోగం పెరుగుతుంది. పండ్లు, కూరగాయలు, పాలు, ఇతర ఆహారాలను ఫ్రిజ్ లో దాచుకోవడం సహజం. కానీ అన్నింటిని ఫ్రిజ్ లో దాచుకోకూడదు. కొన్నింటిని ఫ్రిజ్ లో దాయడం వల్ల పాడైపోతాయి. కొన్ని రకాల పండ్లు ఫ్రిజ్ లో పెడితే తినడానికి అవకాశం ఉండదు. దీంతో వాటిని మనం ఫ్రిజ్ లో పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
పుచ్చకాయ మంచి ప్రొటీన్లు ఉన్న ఆహారం. ఇందులో నీటిశాతమే ఎక్కువ. అందుకే దీన్ని ఫ్రిజ్ లో పెడితే తినడానికి అనుకూలంగా ఉండదు. అందులో పెడితే పోషకాలు నెమ్మదిగా నశిస్తాయి. దీంతో ఫుడ్ పాయిజన్ గా మారుతుంది. ఎప్పుడు కూడా పుచ్చకాయను ఫ్రిజ్ లో పెట్టొద్దు. దీని వల్ల మనకు చెడు ఫలితాలు వస్తాయి.
నారింజ పండ్లలో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని కూడా ఫ్రిజ్ లో పెట్టకూడదు. అలా చేస్తే పోషకాలు కోల్పోతాయి. సిట్రస్ పండ్లను ఫ్రిజ్ లో దాచకూడదు. దానికి బదులు చల్లని నీటిలో ఉంచితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అరటి, అవకాడో, జామ, కివీస్, మామిడి, పుచ్చకాయ, బొప్పాయి, ఖర్జూరాలు, రేగు పండ్లను ఫ్రిజ్ లో ఉంచకూడదని తెలుసుకోవాలి.

ఇలాంటి పండ్లను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల అనర్థాలే వస్తాయి. ఈ నేపథ్యంలో మనం ఈ పండ్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రిజ్ లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వాటిలో ఉండే పోషకాలు పాడు కావు. అంతేకాని మనం వాటిని ఫ్రిజ్ లో పెట్టినట్లయితే మనకు ప్రతికూల ఫలితాలు రావడం తప్పనిసరి. అందుకే ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు వీటిని ఫ్రిజ్ లో ఉంచొద్దని చెబుతున్నారు.