
Director Sukumar: ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే సత్తా ఉన్న డైరెక్టర్స్ ముగ్గురే ముగ్గురు.ఒకటి రాజమౌళి, రెండు సుకుమార్ మరియు మూడు ప్రశాంత్ నీల్.ఎందుకంటే ఈ ముగ్గురు దర్శకులు తీసిన గత చిత్రాలు అన్నీ బాషలలో సంచలన విజయం సాధించాయి.అందుకే ప్రస్తుతం ఇండియా లో వీళ్ళని ఢీ కొట్టే డైరెక్టర్స్ అయితే లేరు.అయితే కీర్తి ప్రతిష్టలు పెరిగినప్పుడు భోగ భాగ్యాలు ఎలా అయితే పెరుగుతాయో, కష్ట నష్టాలు మరియు ఇబ్బందులు కూడా అలాగే పెరుగుతాయి.
ప్రస్తుతం సుకుమార్ పరిస్థితి అలాగే ఉంది.పుష్ప సినిమా తో పాన్ ఇండియాని మాత్రమే కాదు, పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన ఈయనకి “పుష్ప: ది రూల్” చిత్రం కోసం 80 కోట్ల రూపాయిలు పారితోషికం తీసుకుంటున్నాడని ఒక రూమర్ వచ్చింది.సోషల్ మీడియా ద్వారా ఈ వార్త బాగా వైరల్ అవ్వడం తో ఐటీ అధికారుల కన్ను సుకుమార్ ఇంటిపై పడింది.
ఆయన ఇంటిపై ఇటీవలే సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు సుకుమార్ కి గ్రీన్ చిట్ ఇచ్చింది.ఆయన లెక్కలన్నీ పక్కగానే ఉన్నాయని తేల్చింది.అయితే ఈ లెక్కలు తవ్వుతున్నప్పుడు సుకుమార్ అప్పుల చిట్టా కూడా బయటపడింది.మూడేళ్ళ క్రితం ఆయన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వద్ద 3 కోట్ల రూపాయిలు తీసుకున్నాడట.ఇప్పటికీ ఆయన ఆ అప్పుని తీర్చలేదట.ఇది కూడా ఆయన అకౌంట్స్ ని చెక్ చేస్తున్నప్పుడు తెలిసిందట.పాన్ ఇండియా ని శాసించే స్థాయిలో ఉన్న సుకుమార్ కి అప్పులు చేసేంత అవసరం ఏమి వచ్చి ఉంటుంది అనీ అభిమానులు ఆలోచిస్తున్నారు.ఇకపోతే పుష్ప సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.

రీసెంట్ గానే విడుదల చేసిన ఈ చిత్రం గ్లిమ్స్ కి అన్నీ భాషలకు కలిపి 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి.అంతే కాదు ఫస్ట్ లుక్ కి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.దీనితో ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ పాత్ర ఎలా ఉందబోతుందో తెలుసుకునే ఆతృతలో ఉన్నారు, వాళ్ళ ఉత్సాహం ని వచ్చే ఏడాది వరకు ఆపుకోవాల్సిందే.