Money Plant Vastu: మనం ఇంట్లో మొక్కలు పెంచుకుంటాం. ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మొక్కలు పెంచుకోవడం సాధారణమే. కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల మనకు సానుకూల ఫలితాలు వస్తాయి. మనీ ప్లాంటు పెంచుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు రావని చెబుతున్నారు. అది ఏ దిక్కులో ఉంటే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మొక్కలను పెంచుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి.
మనీ ప్లాంటును ఏ దిక్కున పెట్టుకోవాలి
మనీ ప్లాంటును తూర్పు, లేదా ఈశాన్య దిశలో ఉంచుకోవడం మంచిది. ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం సురక్షితం కాదు. మనీ ప్లాంటు ఆకులు ఎండిపోతే తుంచేయాలి. మనీ ప్లాంటు ఆకులు పైకి పాకాలి. కానీ కింది వైపు రాకూడదు. కిందికి వస్తే ప్రతికూలతలు వస్తాయి. మనీ ప్లాంటును ఎప్పుడు కూడా ఇంటి బయట పెట్టకూడదు. గాజు బాటిల్ లో ఉంచుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి.
సమస్యల నుంచి దూరం చేస్తుంది
మనీ ప్లాంటును బెడ్ రూంలో పెట్టుకోవడం మంచిది. దీని వల్ల ఆందోళనలు తగ్గుతాయి. నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. బెడ్ రూంలో ఒక మూలలో పెంచుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో తులసి మొక్క పెంచుకుంటే దాని గాలితో పరిసరాలు శుభ్రం అవుతాయి. ఇంట్లో అనారోగ్య సమస్యలు రాకుండా చేయడంలో కాపాడుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
తులసి మొక్కను సరైన..
తులసి మొక్కను సరైన స్థానంలో ఉంచుకోవాలి. దీంతో తులసిని తూర్పు దిక్కున పెంచుకోవడం మంచిది. ఉత్తరం లేదా ఈశాన్యంలో కూడా పెంచుకోవచ్చు. బాల్కనీలో కూడా పెంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. పూజ గదిలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ గాలి వెలుతురు ఉండేలా చూసుకోవడం మంచిది. ప్రతి రోజు సాయంత్రం తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం శ్రేయస్కరం. తులసిని లక్ష్మీదేవికి స్వరూపంగా చెబుతారు.