
Mosquito Coils Liquid : వేసవి కాలం ప్రారంభమైంది. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉక్కపోత దోమల మోత అన్న చందంగా మారింది ఈ నేపథ్యంలో దోమల నివారణ కోసం మనం మస్కిటో కాయిల్స్, ఆలౌట్ లిక్విడ్ వంటివి ఉపయోగిస్తున్నాం. మస్కిటో కాయిల్స్ వాడకంతో ఇంట్లో దోమలు చావకున్నా మనుషుల ప్రాణాలు మాత్రం పోతున్నాయి. దీంతో దీర్ఘకాలంలో మనల్ని ప్రాణాలు పోయేలా చేస్తున్నాయి. మార్కెట్లో రకరకాల మస్కిటో కాయిల్స్ అందుబాటులో ఉంటున్నాయి. కానీ వాటితో మనకు అనారోగ్యాల ముప్పు పొంచి ఉందని తెలిసినా పట్టించుకోవడం లేదు. ఫలితంగా మస్కిటో కాయిల్స్ తో ఎన్నో రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
మస్కిటో కాయిల్స్ వాడకం ఎంతో ప్రమాదకరం. ఒక మస్కిటో కాయిల్, లిక్విడ్ 100 సిగరెట్లో సమానంగా నిలుస్తుంది. దోమలను నివారించాలని తయారు చేసిన వీటిలో ఉపయోగించే అల్యూమినియం, క్రోమియం, టిన్, క్రిమిసంహారకాలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. దీంతో అవి మనల్ని కుట్టేందుకు అవకాశం ఉండదు. కానీ దాని వాసనతో మన ముక్కు తట్టుకోలేదు. దీంతోనే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. కానీ మనం దోమల బాధ నుంచి విముక్తి కోసం తప్పడం లేదు.

మస్కిటో కాయిల్స్ కు బదులు మన ఇంట్లో లభించే సుగంధ ద్రవ్యాలతో కూడా మనం దోమలను తరిమే చాన్సుంది. మస్కిటో కాయిల్స్ తో వచ్చే పొగతో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. వీటి పొగ ఊపిరితిత్తులను నాశనం చేస్తాయి. కానీ మనకు తప్పడం లేదు. అందుకే మన ఆరోగ్యం చెడిపోవడానికి పరోక్షంగా ఇవే కారణాలుగా నిలుస్తున్నాయి. భవిష్యత్ లో వీటిని వాడకుండా ఉండటమే మంచిది. కాయిల్స్ వాడకంతో ప్రాణాలు కూడా హరీమనే అవకాశం లేకపోలేదు.

మస్కిటో కాయిల్స్ అస్తమా రావడానికి కూడా కారణం అవుతుంది. క్రానిక్ అబ్ర్టక్టివ్ పల్మనరీ వ్యాధితో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలి. మస్కిటో కాయిల్స్ తో అస్తమా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. శ్వాస సంబంధమైన సమస్యలు వస్తాయి. దగ్గు పెరుగుతుంది. ఇన్ని రకాల నష్టాలున్నందున మస్కిటో కాయిల్స్, లిక్విడ్ లను వాడకం పూర్తిగా మానేయాలి. మన ఇంట్లో దొరికే వస్తువులతో సహజసిద్ధంగా మందు తయారు చేసుకుంటే మంచిది. మన ప్రాణాలకు ముప్పు ఉండదు.