
Dussehra Controversy : నాని హీరోగా నటించిన ‘దసరా’ థియేటర్లో దద్దరిల్లుతోంది. ఈ మూవీకి ఫస్ట్ రోజే బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కొందరు ఈ సినిమాపై రకరకాల విమర్శలు చేస్తున్నాటేకింగ్ తో పాటు నాని యాక్షన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో సినిమాను చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. అయితే ఏ హిట్టు సినిమాకైనా ఓ వివాదం వెన్నంటే ఉంటుంది. కొన్ని సినిమాలు వివాదాలతోనే మొదలై పాపులర్ అవుతూ ఉంటాయి. అయితే ‘దసరా’ మూవీ రిలీజైన తరువాత ఇందులో అంగన్ వాడీలను తప్పుగా చూపించారని కొందరు తప్పు పడుతున్నారు. ఈ సినిమాలోని అంగన్ వాడీలకు సంబంధించిన సీన్ ను తీసేయ్యకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.
‘దసరా’ మూవీ షూటింగ్ స్టాట్ నుంచే హోప్స్ పెరిగాయి. నాని లుక్స్ తో పాటు సినిమా నేపథ్యం తెలియడంతో మరింత ఆశలు పెరిగాయి. సినిమా కథ పూర్తిగా తెలియకపోయినా సినిమా బొగ్గు గనుల నేపథ్యంలో సాగుతుందని అనుకున్నారు. ఉత్తర తెలంగాణలోని గోదావరిఖనిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు పిక్స్ బయటకు రావడంతో సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఈ సినిమా రిలీజైన తరువాత హోప్స్ కు అనుగుణంగానే సినిమా బ్లాక్ బస్టర్ అని తేలుతోంది.
అయితే ఈ సినిమాపై అంగన్ వాడీ సిబ్బంది మాత్రం నిరసన తెలుపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అంగన్ వాడీ కార్యకర్తలు దసరా మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద ఆందోళన చేశారు. దసరా సినిమాలో అంగన్ వాడీలో కోడిగుడ్లు అమ్ముకుంటున్నట్లు చూపించారట. తమల్ని అలా చూపించినందుకు వారు మండిపడుతున్నారు. అసలే చాలీ చాలని వేతనాలతో నిస్వార్థంగా సేవలందిస్తుతన్న తమల్ని ఇలా నీచంగా చూపించడం భావ్యం కాదని అన్నారు. ఈ సినిమాలోని అంగన్ వాడీలకు సంబంధించిన సీన్ తీసేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
మరి ఈ సినిమాపై డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఎలా స్పందిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘దసరా’ మూవీలో గతంలోనే ఓ వర్డ్ పై వివాదం నెలకొంది. ఇలాంటి వర్డ్స్ బూతుకిందకు వస్తాయని, వీటిని వాడొద్దని కొందరు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. కానీ తెలంగాణాలో ఇది బూతు కాదని నాని క్లారిటీ ఇచ్చారు. అయితే సెన్సార్ మాత్రం 36 చోట్ల కట్ పెట్టినట్లు సమాచారం. అయినా సినిమా రిలీజై సంచలన విజయం సాధించింది. కానీ ఇప్పుడు అంగన్ వాడీల నిరసనపై ఎలాంటి రియక్షన్ ఉంటుందో చూడాలి.