T20 World Cup 2022 Prize Money: అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కు సన్నద్ధం అవుతోంది. ఐసీసీ గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రైజ్ మనీ ప్రకటించింది. విజేతకు రూ. 13 కోట్లు, రన్నరప్ కు రూ. 6.5 కోట్లు దక్కనున్నట్లు తెలుస్తోంది. సెమీఫైనల్ లో ఓడిన ఒక్కో జట్టుకు రూ. 3.25 కోట్లు దక్కనున్నాయి. సూపర్ 12లో నిష్క్రమించిన ఒక్కో టీంకు రూ. 57 లక్షలు అందనున్నాయి. సూపర్ 12 దశలో ఒక్కో విజయానికి అదనంగా రూ. 32 లక్షలు దక్కించుకోనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించిన జాబితాలోని నజరానాలు చూస్తుంటే విజయాలకు దక్కే ప్రతిఫలం భారీగానే ఉంటోంది. దీంతో అన్ని జట్లు విజయం సాధించాలనే తాపత్రయంతో ఉన్నాయి.

సూపర్ 12 స్టేజ్ లో మొత్తం 30 మ్యాచులు జరగనున్నాయి. మొత్తం రూ. 9.60 కోట్ల బహుమతిగా అందించనుంది. దీంతో అన్ని జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. విజయం సాధించడమే ధ్యేయంగా కసరత్తులు ముమ్మరం చేస్తున్నాయి. వ్యూహాలు ఖరారు చేసుకుంటున్నాయి. ప్రత్యర్థి జట్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై మార్గనిర్దేశం చేస్తున్నాయి. ఆటగాళ్లలో నైపుణ్యం పెరిగేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. దీంతో టీ20 ప్రపంచ కప్ పై అందరికి అంచనాలు భారీగానే ఉన్నాయి.
భారత్, అఫ్గనిస్తాన్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా దేశాలు నేరుగా సూపర్ 12 దశలో నిలిచాయి. నమీబియా, శ్రీలంక, నెదర్లాండ్స్, యూఏఈ, వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వే టీంల మధ్య జరిగే మ్యాచుల్లో విజేతలుగా నిలిచిన నాలుగు జట్లు సూపర్ 12 దశకు అర్హత తెచ్చుకుంటాయి. దీంతో మొదటి దశలో ఒక్కో మ్యాచులో విజేతగా నిలిచిన జట్టు రూ. 32 లక్షలు సొంతం చేసుకుంటుంది. రౌండ్ 1లో జరిగే 12 మ్యాచులకు రూ.3.84 కోట్లు ప్రైజ్ మనీ అందనుంది.

దీంతో టీ20 ప్రపంచ కప్ లో ఎలాగైనా కప్ గెలవాలని అన్ని జట్లు సమరోత్సాహంతో ఉన్నాయి. చిన్న దేశాలైనా పోటీలో నిలిచి విజయం సాధించడమే లక్ష్యంగా చేసుకుంటున్నాయి. పసికూనలుగా చెబుతున్న నమీబియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ జట్లు సైతం కప్ కోసమే తాపత్రయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్ పై అందరిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. కప్ గెలుచుకోవడమే ధ్యేయంగా కదులుతున్నాయి. ఐసీసీ ప్రైజ్ మనీని దక్కించుకోవాలని ఉబలాట పడుతున్నాయి.