Twitter Blue Tick Price: ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ నూతన సంస్కరణలు చేపడుతున్నారు. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను సొంతం చేసుకున్న మస్క్ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఆదాయం పెంచుకునే మార్గాల వైపు దృష్టి మళ్లిస్తున్నారు. దీంతో ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. యాభై శాతం మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ప్రస్తుతం మనదేశంలో బ్లూ టిక్ మార్కుపై కూడా మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక మీదట బ్లూ టిక్ మార్కు ఉన్న వారు నెలకు రూ. 719 లు చెల్లించాలని నిర్ణయించారు. దీంతో ఖాతాదారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

ప్రస్తుతం ఐ ఫోన్లు వాడుతున్న ట్విట్టర్ ఖాతాదారులకు చార్జీలతో కూడిన సందేశాలు రావడంతో అందరు అవాక్కయ్యారు. భవిష్యత్ లో యూజర్ చార్జీల కింద వీటిని వసూలు చేసేందుకు మస్క్ తప్పనిసరి చేయడం గమనార్హం. బ్లూ టిక్ యూజర్లు సందేశాలు వచ్చిన వారు వాటిని స్క్రీన్ షాట్లు తీసి ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు. ఇందులో నెలవారీ చార్జీ రూ.719గా కనిపించడం విశేషం. ఇక మీదట బ్లూటిక్ ఉన్న ఖాతాదారులు డబ్బులు చెల్లించాల్సిందే. కావాలంటే ఈ ఫీచర్ ను రద్దు చేసుకునే అవకాశం కల్పించారు.
ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా బ్లూ టిక్ రావడంతో ఖాతాదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఖాతాదారులకు మరిన్ని ప్రయోజనాలు ఇవ్వనున్నట్లు మస్క్ ఇదివరకే ప్రకటించడంతో ఖాతాదారులకు బ్లూ టిక్ తో ఇబ్బంది కలుగుతోంది. వెరిఫికేషన్ లేకుండా ఇవ్వడం వల్ల నకిలీ ఖాతాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ముఖ్య వ్యక్తులను గుర్తించేందుకు అధికారిక గుర్తును ట్విట్టర్ తీసుకొచ్చింది. ఇప్పటికే చాలా మంది ప్రభుత్వేతర వ్యక్తుల ఖాతాలకు కూడా బ్లూ టిక్ ఉండటంతో ఇప్పుడు యాజమాన్యం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు.

మస్క్ తీసుకున్న నిర్ణయాలతో అందరు ఆశ్చర్యపోతున్నారు. బ్లూటిక్ గుర్తుతో తన సంపాదన పెంచుకోవాలని చూస్తున్నారు. ఎడాపెడా తీసుకున్న నిర్ణయాలతో అందరిలో కలవరం మొదలైంది. ఎలాన్ మస్క్ వ్యవహారంతో అందరిలో అలజడి ప్రారంభమైంది. ట్విట్టర్ నుంచి వచ్చిన సందేశం కొన్ని గంటల్లోనే వెనక్కి తీసుకుంది. ఇక మస్క్ ఎలాంటి నిర్ణయం తీసుకుని సంస్థను పురోభివృద్ధికి తీసుకొ్చ్చే చర్యలు తీసుకుంటారో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ఖాతాదారుల భవితవ్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.