Ashu Reddy: బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డికి ఎక్కడో మండింది. తనను విమర్శిస్తున్న వాళ్లకు తనదైన స్టైల్ లో చురకలు వేసింది. హాట్ బ్యూటీ అషురెడ్డి ఇంస్టాగ్రామ్ వీడియో సంచలనం రేపుతోంది. అషురెడ్డి ఇటీవల గ్లామర్ డోస్ పెంచారు. పొట్టి బట్టలో ఓవర్ ఎక్స్పోజ్ చేస్తున్నారు. అషురెడ్డి బోల్డ్ ఫోటోలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆ బట్టలేంటి, అసలు ఆడపిల్లవేనా అంటూ ఏకిపారేస్తున్నారు. నీ స్కిన్ షో హద్దులు దాటేసింది అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఒక నెటిజన్ అయితే ఇంతకు దిగజారే బదులు వెళ్లి బూతు చిత్రాలు చేసుకో.. అని కామెంట్ చేశాడు. చాలా మంది నెటిజెన్స్ రాయలేని భాషలో బూతులు తిడుతున్నారు.

ఈ కామెంట్స్ కి అషురెడ్డి తీవ్రంగా స్పందించారు. నేరుగా తిట్టకుండా కామెంట్స్ ని ఉద్దేశిస్తూ ఒక వీడియో పోస్ట్ చేసింది. నటి రామాప్రభ ఒక మూవీలో చెప్పిన ”కామాం తురాణం నభయం నలజ్జ. కామంతో కళ్ళు మూసుకుపోయిన వెధవకి సిగ్గు, లజ్జ, భయం, భక్తి ఉండవు” అనే డైలాగ్ తో వీడియో చేసి పోస్ట్ చేసింది. మీరు కామం కళ్లతో నా ఫోటోలు చూస్తున్నారు. అందుకే మీకు వల్గర్ గా కనిపిస్తున్నాయి. లోపం మీ దృష్టిలో ఉంది, నా బట్టల్లో కాదని చెప్పే ప్రయత్నం చేసింది అషురెడ్డి.
మీరు ఎన్ని విమర్శలు చేసినా నేను తగ్గేది లేదని చెప్పకనే చెప్పింది. ఆ తిడుతున్న వీడియోలో కూడా అషురెడ్డి డ్రెస్ అభ్యంతరకరంగా ఉంది. గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారికి అందమే పెట్టుబడి. దాన్ని దాచుకోవడం అంటే కెరీర్ నాశనం చేసుకోవడమే అని భావిస్తారు. యాంకర్ అనసూయ డ్రెస్సింగ్ పై ఏళ్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. అయినా అనసూయ తగ్గిందే లేదు. యాంకర్ గా, నటిగా లక్షలు సంపాదిస్తున్న అనసూయే మారనప్పుడు అషురెడ్డి లాంటి అరాకొరా సంపాదన ఉన్న అమ్మాయి ఎందుకు మారుతుంది.

ఇంస్టాగ్రామ్ ఆదాయమార్గంగా మారినప్పటి నుండి ఈ ట్రెండ్ ఎక్కువైంది. గ్లామరస్ ఫోటోలు తరచుగా పోస్ట్ చేసి ఫాలోవర్స్ సంఖ్య పెంచుకోవాలని సెలెబ్రిటీలు ఆరాటపడుతున్నారు. ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా వాళ్ళ బ్రాండ్ వాల్యూ డిసైడ్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇంస్టాగ్రామ్ వ్యూస్ తో కారు ఈఎంఐ లు కడుతున్నానని చెప్పింది. అషురెడ్డి ఇటీవల రూ. 72 లక్షల విలువైన బెంజ్ కారు కొనుగోలు చేసింది. జాన్వీ మాదిరి అషురెడ్డి కూడా కారు ఇన్స్టాల్మెంట్స్ కట్టడానికి అందాలు ఆరబోస్తుందేమో…