https://oktelugu.com/

Romance : ఏ వయసు వారు ఎన్నిసార్లు సంభోగంలో పాల్గొంటున్నారో తెలుసా? షాక్ ఇస్తున్న నివేదికలు.

ఇటీవలో ఓ సంస్థ నివేదికను బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం ఏ వయసు వారు ఎన్నిసార్లు కలయికలో పాల్గొంటున్నారు? ఏ వయసు వారు ఎంత ఆసక్తి చూపుతున్నారు? అనే విషయాలను బటయపెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

Written By:
  • Srinivas
  • , Updated On : September 8, 2024 / 01:31 PM IST

    Romance

    Follow us on

    Romance :  ‘శృంగారం ఆరోగ్యకరం’ అన్నారు పెద్దలు.. ఒక ఆడ, ఒక మగ వ్యక్తుల కలయిక వల్ల జరిగే క్రియ ద్వారా ఇద్దరూ ఎంతో తృప్తి చెందుతారు. ఈ క్రియ కోసం పెళ్లి కాని యువకులు ఎంతో ఆతృతతో చూస్తారు. అయితే పెళ్లయిన తరువాత క్రమ పద్ధతిలో ఈ కార్యంలో పాల్గొంటే వారి జీవితం ఆనందంగా గడుస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో డబ్బు సంపాదన, తదితర కారణాల వల్ల చాలా మంది శృంగారంపై ఆసక్తి చూపడం లేదు. వయసు పైబడిన తరువాత పెళ్లి చేసుకోవడం.. ఒత్తిడి కారణంగా ఈ క్రియకు దూరంగా ఉంటున్నారు. దీంతో మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇటీవలో ఓ సంస్థ నివేదికను బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం ఏ వయసు వారు ఎన్నిసార్లు కలయికలో పాల్గొంటున్నారు? ఏ వయసు వారు ఎంత ఆసక్తి చూపుతున్నారు? అనే విషయాలను బటయపెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

    ఇండియానా యూనివర్సిటీకి చెందిన కిన్సే ఇనిస్టిట్యూట్ కు చెందిన కొందరు పరిశోధకులు సంభోగం కు సంబంధించిన కొన్ని వివరాలు బయటపెట్టారు. వీరు వ్యక్తుల లైంగిక జీవితాలు, సామర్థ్యాలను అంచనా వేసి ఏ వయసు వారు ఏ విధంగా ఆసక్తి చూపుతున్నారో వివరించారు. వీరు నివేదించిన లెక్కలను చూసి దిగ్బ్రాంతి చెందాల్సి వచ్చింది. వీటిలో మునుపటి తరాల కంటే ఇప్పుడు లైంగిక సంబంధాల విషయంలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని అర్థమైంది. ముఖ్యంగా యువతరం ఎక్కువగా దీనిపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

    ఈ ఇనిస్టిట్యూట్ పరిశోధనలు ఎలా చేసిందంటే.. ముందుగా ఫీల్డ్ అనే డేటింగ్ యాప్ ఆధారంగా వివరాలను సేకరించారు. ఇందులో 3,310 మందిని తీసుకున్నారు. వీరిలో 18 నుంచి 75 సంవత్సరాల వయసు వారు ఉన్నారు. ఇందులో 71 దేశాల నుంచి వేర్వేరు వ్యక్తులు ఉన్నారు. వీరి ప్రతిరోజూ, ప్రతి నెల లైంగిక సంబంధాల విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకున్నారు. ఈ లెక్కలు ఎలా ఉన్నాయంటే?

    సగటున పాత జనరేషన్ వారి కంటే కొత్త జనరేషన్ వారు గత నెలలో మూడు సార్లు మాత్రమే లైంగిక క్రియలో పాల్గొన్నట్లు తేలింది. కానీ ఎక్కువ వయసు ఉన్న పాత జనరేషన్ వారు ఎక్కువ శారీరక సంబంధాలను కలిగి ఉన్నట్లు తేలింది. ఈ తరాల వారు గత నెలలో 5 సార్లు సంభోగంలో పాల్గొన్నట్లు తేలింది. అయితే కొత్త జనరేషన్ వారు మాత్రం తక్కువగా 3 సార్లు మాత్రమే లైంగిక క్రియలో పాల్గొన్నట్లు తేలింది.

    అయితే కొత్త జనరేషన్ వారు ఎక్కువగా సంభోగంలో పాల్గొనేందకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. చదువు, కెరీర్ విషయాల నేపథ్యంలో వీరు లైంగిక సంబంధాలపై దృష్టి పెట్టడం లేదు. కొత్త జనరేషన్ వారు, వయసు మళ్లిన వారు దాదాపు ఒకే ప్రీక్వెన్సీతో కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బూమర్లలో ఐదో వంతు అంటే 20 శాతం వరకు ఒంటరిగా ఉన్నారు. కానీ మిలీనియల్స్ జనరేషన్ మాత్రం అన్నింట్లో చురుకుగా ఉన్నట్లు తెలుస్తోంది.