Deepika Padukone delivery : రణవీర్ కపూర్ – దీపికా పదుకొనే ప్రేమ జంట పండంటి ఆడబిడ్డకు జన్మని ఇచ్చారు. 2018 వ సంవత్సరం లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట, తమ కమిట్మెంట్స్ కారణంగా ఇన్ని రోజులు పిల్లల్ని ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడు దీపికా పదుకొనే తన కమిట్మెంట్స్ మొత్తాన్ని పూర్తి చేసుకోవడంతో బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలియచేసారు. అయితే ఇక్కడ అభిమానులకు మొదటి నుండి మెలుగుతున్న సందేహం ఏమిటంటే ‘కల్కి’ చిత్రం లో దీపికా సినిమా మొత్తం బేబీ బంప్ తోనే కనిపిస్తుంది. అది ఆమె తనకు ఉన్నటువంటి నిజమైన బేబీ బంప్ తోనే సినిమా చేసిందా?, లేక గ్రాఫిక్స్ తో మేనేజ్ చేశారా అనే సందేహం లో ఉన్నారు ఫ్యాన్స్. అయితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొన్ని సన్నివేశాలు దీపికా కి డూప్ నటించగా, అత్యధిక సన్నివేశాలు దీపికా నిజమైన బేబీ బంప్ తోనే నటించింది.
సినిమా ప్రొమోషన్స్ సమయంలో కూడా ఆమె బేబీ బంప్ తోనే కనిపించింది. అప్పటి వరకు ఆమె గర్భం దాల్చిన విషయం బాలీవుడ్ ఆడియన్స్ కి పెద్దగా అవగాహనా లేదు. ఏమైంది దీపికా పొట్టకు, గర్భం దాల్చిందా, లేదా కల్కి సినిమా ప్రొమోషన్స్ కోసం అలా చేస్తుందా అనే సందేహం లో ఉండేవారు. ఇదే విషయాన్నీ దీపికా పదుకొనే ని కల్కి ప్రొమోషన్స్ విలేఖరులు అడగగా, ప్రభాస్ షూటింగ్ సమయంలో నాకు రోజు పెట్టే ఫుడ్ తిని ఇలా తయారయ్యాను, అని ఫన్నీ గా సమాధానం ఇచ్చింది. ఇదంతా పక్కన పెడితే దీపికా పదుకొనే మరియు రణవీర్ సింగ్ మీద కూడా గతం లో అనేకమైన రూమర్స్ వచ్చాయి. వీళ్లిద్దరు కలిసి బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ అనే ప్రోగ్రాం కి వెళ్లారు. ఆ ప్రోగ్రాం లో దీపికా పదుకొనే క్రష్ గురించి, గతం లో ఆమె ఇష్టపడి డేటింగ్ చేసిన హీరోల గురించి చెప్పుకొచ్చింది. దీనికి ఆ షో లోనే రణవీర్ సింగ్ చిరాకు పడుతాడు.
ఈ షో తర్వాత ఇంటికి వెళ్లిన తర్వాత రణవీర్ సింగ్ ఈమెతో గొడవకు దిగాడని, వీళిద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయి అని, ఎడమొహం పెడమొహం అన్నట్టుగా వీళ్ళ వ్యవహార శైలి ప్రస్తుతం కొనసాగుతుంది అంటూ రకరకాలుగా చెప్పుకొచ్చారు. కానీ అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని తిప్పి కొట్టింది ఈ జంట. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి ఆదర్శ దంపతులుగా నిలిచారు. చిన్న చిన్న విబేధాలకు పవిత్రమైన పెళ్లి వ్యవస్థని బ్రష్టు పట్టిస్తూ ఏడాది తిరిగే లోపే విడాకులు తీసుకుంటున్న సినీ సెలెబ్రిటీలు ఉంటున్న ఈ రోజుల్లో దీపికా పదుకొనే , రణవీర్ సింగ్ 5 ఏళ్ళ దాంపత్య జీవితాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి, అనోన్య దంపతులుగా ముందుకు సాగుతుండడం నిజంగా హరిషించదగ్గ విషయం, వీళ్లిద్దరు జీవితాంతం ఇలాగే సంతోషం గా ఉండాలని కోరుకుందాం.