Hyper Aadi: పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో హైపర్ ఆది ఒకరు. పవన్ చూపిన బాటలో నడుస్తూ జనసేన పార్టీ క్రియాశీలక నాయకుడిగా మారారు. ఆ మధ్య రణస్థలం వేదికగా జరిగిన యువ గర్జన సభలో హైపర్ ఆది మాట్లాడారు. హైపర్ ఆది స్పీచ్ జనసైనికులను ఎంతగానో ఆకట్టుకుంది. పవన్ సైతం హైపర్ ఆది వాక్పటిమకు ముగ్ధుడయ్యాడని సమాచారం. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో హైపర్ ఆది జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. హైపర్ ఆది సొంత జిల్లా ప్రకాశం నుండి హైపర్ ఆది పోటీ చేసే అవకాశం కలదట.
పవన్ అంటే తనకు ఎంత అభిమానమో తెలియజేస్తూ ఓ సంఘటన వివరించాడు హైపర్ ఆది. సార్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ… నిర్మాత సూర్యదేవర నాగవంశీ గారు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్లు చెబుతారు. ఆయన కామెంట్స్ అప్పుడప్పుడూ ట్రోల్స్ కి గురవుతూ ఉంటాయి. ఆయన నిజాయితీ గురించి తెలిసినవారు మాత్రం ట్రోల్ చేయరు. ఒకరోజు నేను షూట్లో ఉండి నాగ వంశీ గారికి కాల్ చేశాను. భీమ్లా నాయక్ షూట్ కి రాలేను ఢీ వాళ్ళు అడుగుతున్నారు. ఒక రోజు గ్యాప్ కావాలి అన్నాను.
నీకు పవన్ కళ్యాణ్ కావాలా లేక ఢీ కావాలా? అని అన్నాడు. ఆ మాటతో రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ భీమ్లా నాయక్ షూట్ కి వెళ్ళిపోయాను, అని హైపర్ ఆది తెలియజేశారు. పవన్ కళ్యాణ్ కోసం ఢీ షో పక్కన పట్టేశానని ఆది పరోక్షంగా చెప్పారు.భీమ్లా నాయక్ మూవీలో హైపర్ ఆది చిన్న పాత్ర చేశాడు. నటుడిగా, రచయితగా సిల్వర్ స్క్రీన్ మీద హైపర్ ఆది బిజీ అవుతున్నారు. ధనుష్ హీరోగా నటించిన సార్ చిత్రంలో హైపర్ ఆది ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. డైలాగ్స్ కూడా అందించాడని సమాచారం. లేటెస్ట్ హిట్ ధమాకా చిత్రానికి కూడా హైపర్ ఆది డైలాగ్ రైటర్ గా పనిచేశారట.
జబర్దస్త్ కమెడియన్ గా హైపర్ ఆది ప్రస్థానం మొదలైంది. తన కామెడీ టైమింగ్ తో టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. హైపర్ ఆది స్కిట్స్ జబర్దస్త్ లో సంచలనాలు నమోదు చేశాయి. అనంతరం ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీలలో కూడా యాంకర్ గా చేస్తున్నారు. నటుడిగా కొనసాగుతూనే… తనకు లైఫ్ ఇచ్చిన బుల్లితెరను వదలడం లేదు. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంచలంచెలుగా ఎదుగుతూ బుల్లితెర స్టార్ అయ్యాడు.
Also Read: Modi’s Kashmir Mission : కశ్మీర్.. ఊపిరి పీల్చుకో.. అక్కడ మోడీ ఉన్నాడు..