Zodiac Signs: జనవరి 17న శని కుంభరాశిలో ప్రవేశించాడు. దీంతో గ్రహాల పనితీరులో కొంత మార్పులు వస్తున్నాయి. కొద్ది రోజుల్లో ఫిబ్రవరి రానుండటంతో కొన్ని రాశులకు శుభాలు కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 14 నుంచి సూర్యుడు మకరరాశిలో సంచరించడం వల్ల కూడా పలు మార్పులు చోటుచేసుకునే అవకాశాలుంటున్నాయి. దీంతో ఫిబ్రవరిలో ఏ రాశులకు మంచి జరుగుతుందో తెలుసుకుందాం. గ్రహాలు మారడం వల్ల ఫిబ్రవరి నెలలో కొన్ని రాశులకు అదృష్టం వరించనుంది. అందులో ఏడు రాశులు ఉండటం గమనార్హం.

మేషరాశి వారికి జనవరిలో మాదిరి ఫిబ్రవరిలో కూడా మంచి జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. పెట్టుబడులకు మంచి అనుకూల కాలం. రాదనుకున్న డబ్బు తిరిగి చేతికి అందుతుంది. చేపట్టిన పనుల్లో విజయాలు సొంతం అవుతాయి. అందరి సహకారం లభిస్తుంది. వృషభ రాశి వారికి కూడా అనుకూల కాలమే. లాభాలు పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆశించిన ఆదాయం పొందడానికి వీలుంటుంది. పెట్టుబడుల్లో మంచి లాభాలు అందుతాయి.
మిధున రాశి వారికి కూడా అదృష్టం కలుగుతుంది. ఆర్థికంగా మంచి కాలమే నడుస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఫిబ్రవరి 15 తరువాత ఇంకా బాగుంది. ఇక కన్య రాశి వారికి కూడా శుభాలే కలుగుతాయి. కార్యాలయాల్లో ఇబ్బందులు పడే ఉద్యోగులకు ఇకపై అలాంటి సమస్యలు ఉండవు. ఆర్థిక కష్టాలు తొలగుతాయి. వృశ్చిక రాశి వారికి కూడా మంచిదే. భూమి, ఇల్లు, వాహనం కొనుగోలు చేస్తారు. ఊహించని అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సంతోషమైన కాలం గడుపుతారు. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి.

ధనుస్సు రాశి వారికి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. షేర్ మార్కెట్లో లాభాలు పొందడం ఖాయం. మీ పెట్టుబడులకు మంచి లాభాలు చేతికి అందుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కుతాయి. శుభవార్తలు వింటారు. సంతోషంగా కాలం గడుపుతారు. కుంభ రాశి వారికి కూడా ఆదాయం పెరుగుతుంది. కెరీర్ లో మంచి విజయాలు అందుకుంటారు. పనిలో నూతన బాధ్యతలు చేపడతారు.