Phone call Recordings: మన ఫోన్ కాల్ రికార్డింగ్స్ ఎన్ని రోజుల వరకు సేవ్ చేస్తారో తెలుసా?

Phone call Recordings: మనం మాట్లాడే ప్రతి ఒక్క ఫోన్ కాల్ సర్వీస్ ఆపరేటర్ల వద్ద రికార్డింగ్ చేయబడి ఉంటాయి అనే విషయం మనకు తెలిసిందే. అయితే గతంలో ఫోన్ కాల్ రికార్డ్స్ కేవలం ఒక ఏడాదిపాటు మాత్రం ఆపరేటర్ ల వద్ద సేవ్ చేయబడి ఉంటాయి. తాజాగా ఈ గడువును కాస్తా పొడిగించి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మరి ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఫోన్ రికార్డింగ్స్ సేవ్ చేయబడి ఉంటాయి అనే విషయానికి […]

Written By: Navya, Updated On : December 27, 2021 4:20 pm
Follow us on

Phone call Recordings: మనం మాట్లాడే ప్రతి ఒక్క ఫోన్ కాల్ సర్వీస్ ఆపరేటర్ల వద్ద రికార్డింగ్ చేయబడి ఉంటాయి అనే విషయం మనకు తెలిసిందే.

అయితే గతంలో ఫోన్ కాల్ రికార్డ్స్ కేవలం ఒక ఏడాదిపాటు మాత్రం ఆపరేటర్ ల వద్ద సేవ్ చేయబడి ఉంటాయి. తాజాగా ఈ గడువును కాస్తా పొడిగించి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.మరి ఇప్పుడు ఎన్ని రోజుల వరకు ఫోన్ రికార్డింగ్స్ సేవ్ చేయబడి ఉంటాయి అనే విషయానికి వస్తే…

తాజాగా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 21 న సర్వీస్ ప్రొవైడర్లకు నోటీఫికేషన్ జారీ చేసింది.ఈ నోటిఫికేషన్ ప్రకారం మనం మాట్లాడే ప్రతి ఒక్క ఫోన్ కాల్ రికార్డింగ్స్ సర్వీస్ ఆపరేటర్ల వద్ద రెండు సంవత్సరాల పాటు సేవ్ చేయబడి ఉండాలని పేర్కొంది. కేవలం నార్మల్ ఫోన్ కాల్స్ మాత్రమే కాకుండా ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ కూడా రెండు సంవత్సరాల వరకు సేవ్ చేసి ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read: Children Policy: బిడ్డ పుట్టగానే ఈ 5 సూత్రాలు పాటిస్తే.. లేదంటే కష్టాల్లో ఉన్నట్టే!

పలు భద్రతా సంస్థల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ఫోన్ కాల్, ఇంటర్నెట్ ఫోన్ కాల్ రికార్డింగ్స్ మాత్రమే రెండు సంవత్సరాల వరకు సేవ్ చేయబడి ఉంటాయి అలాగే ఈ ఫోన్ కాల్స్ మినహా మిగిలిన డేటాను సర్వీస్ ప్రొవైడర్లు 45 రోజులలో సర్వర్ల నుండి తొలగించబడుతుంది.ఇక భద్రతా సంస్థలు కోరితే ఎవరైతే ఫోన్ కాల్స్ రికార్డింగ్ సేవ్ చేయబడి ఉంటాయో వారి ఫోన్ కాల్ రికార్డింగ్స్ టెక్స్ట్ రూపంలో కూడా వారు ఎవరితో మాట్లాడారు ఏం మాట్లాడారు అనే విషయాలను అందించనున్నట్లు పేర్కొన్నారు.

Also Read: Chanakya Niti: విద్యార్ధుల కోసం చాణక్యుడు చెప్పిన ముఖ్య విషయాలు ఏంటో తెలుసా ?