Children Policy: ఇద్దరిని ఒకటిగా కలిపి ఓ బంధంతో ముడుపెడుతుంది వివాహం. పెళ్లి అనే బంధం ఎంత హాయినిస్తుందో.. ఆ తర్వాత పుట్టే పిల్లలు అంతకు రెట్టింపు ఆనందాన్ని కలిగిస్తారు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు పుట్టగానే, తమ జీవితంలో ఏదో సాధించిన ఫీలింగ్‌లోకి వెళ్లిపోతారు. ఆ క్షణం వారి జీవితాల్లో ఎప్పటికీ నిలిచిపోయే ముధరమైన అనుభవాల్లో ఒకటి. ఈ శుభవార్తతో పాటు కొన్ని బాధ్యతలు కూడా భార్యాభర్తలపై వచ్చి పడతాయ్. బిడ్డ పుట్టగానే వారి బాగోగులు చూసుకునేందుకు తల్లిదండ్రులు కొంత ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలి. ముఖ్యంగా సంతానం కలిగిన వెంటనే ఈ ఐదు సూత్రాలను పాటిస్తే.. బిడ్డ భవిష్యత్తు చాలా అందంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
బిడ్డ పుట్టిన వెంటనే బర్త్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు పెట్టాలి. ఆసుపత్రిలోనే ఈ దరఖాస్తును పొందచ్చు. బిడ్డ జన్మించినట్లు ఆసుపత్రి సిబ్బందే ఓ లెటర్ కడా ఇస్తుంది. పుట్టిన 21 రోజుల తర్వాత బర్త్ సర్టిఫికెట్ అప్లికేషన్‌ను స్థానిక అధికారులకు అందించాలి.
పొదుపు ఖాతా…
పుట్టిన బిడ్డకు ఓ పొదుపు ఖాతాను తెరిస్తే వారి భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తతం చిన్న పిల్లలకు కూడా సేవింగ్ అకౌంట్లను అందిస్తున్నాయి.
జీవిత భీమా…
పుట్టిన బిడ్డకు చాలా ఖర్చులుంటాయి. ఒక్కోసారి వారికి ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. ఈ క్రమంలోనే వారికి జీవిత భీమా చాలా ఉపయోగపడుతుంది. వార్షిక ఆదాయానికి 15 నుంచి 20 రెట్ల హామీ అందించే పాలసీ తీసుకుంటే చాలా మంచింది. కాబట్టి, ఆరోగ్య భీమాలో మీ పిల్లల పేర్లను కూడా వెంటనే నమోదు చేయండి.
నామినీ అప్డేట్…
ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూటువల్ ఫండ్లు ఇలా ఏదో ఒక దాంట్లో పిల్లలను నామినీగా చేరిస్తే మంచిది. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మీ సంపద మొత్తం మీ పిల్లలకు అందుతుంది. అలా చేయని పక్షంలో మీరు కూడబెట్టిందంతా అలాగే అనవసరంగా పోయే ప్రమాదం ఉంది.
Also Read: Chanakya Niti: విద్యార్ధుల కోసం చాణక్యుడు చెప్పిన ముఖ్య విషయాలు ఏంటో తెలుసా ?
బట్టలు, బొమ్మలు…
బిడ్డ పుట్టిన వెంటనే ఆడుకోడనికి ఖరిదైన బొమ్మలు, బట్టలు కొంటుంటారు తల్లిదండ్రులు. నిజానికి పుట్టిన పిల్లలు కొన్ని రోజుల పాటు ఎక్కువగా నిద్రకు ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి పుట్టిన వెంటనే పిల్లలకు బొమ్మలను అలవాటు చేయకపోవడం మంచింది. అలాగే బట్టలు కూడా వేయాల్సి అవసరం లేదు.
Also Read: Night Food: రాత్రి భోజనం తర్వాత పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి..?