NTR and MGR: తెలుగు చిత్రసీమ అప్పుడప్పుడే ఎదుగుతుంది. చిన్న చిన్న గ్రామాల్లో కూడా ప్రజలు నాటకాల గురించి ముచ్చట్లు మానేసి సినిమాల పై చర్చలు మొదలు పెట్టిన రోజులు అవి. ఆ రోజుల్లో అనగా అరవై ఏళ్ల క్రితం.. అప్పుడప్పుడే ‘ఎన్టీఆర్’ స్టార్ గా మారుతున్నాడు. చాలా తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ తెలుగు సినిమాకి రారాజుగా ఎదిగాడు. అయితే, ఎన్టీఆర్ ఎంత ఎదిగినా ఆయనకు మాత్రం ఎప్పుడూ మేకప్ మెన్ సమస్య ఉండేది.
ఎన్టీఆర్ కి తగ్గట్టు మేకప్ వేసే మేకప్ మెన్ దొరకడం లేదు. దొరికిన వాళ్ళు ఎన్టీఆర్ కి నచ్చడం లేదు. దాంతో ఎన్టీఆర్ ఏ సినిమా షూటింగ్ కి వెళ్లినా తనకు ఒక పర్సనల్ మేకప్ మెన్ అవసరం బాగా ఉందని అందరికి చెబుతూ ఉండేవారు. అయితే, ఓ రోజు ఏమ్జీయార్ దగ్గరకు వెళ్లారు. అక్కడ కూడా ఎన్టీఆర్ తన మేకప్ మెన్ గురించే ప్రస్తావించారు.
సహజంగా ఎన్టీఆర్ అంటే ఏమ్జీయార్ కి ఎంతో గౌరవం. పైగా ఎన్టీఆర్ ని సోదరుడిగా ఏమ్జీయార్ భావించే వారు. తాను తమిళంలో, ఎన్టీఆర్ తెలుగులో ఒకే స్థాయి వాళ్ళం అని ఏమ్జీయార్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఎన్టీఆర్ కూడా ఎప్పుడు ఏమ్జీయార్ దగ్గరకు వెళ్లినా.. ఏదొక ప్రత్యేక ఆహారాన్ని వండించుకుని తీసుకువెళ్లవారు.
అందుకే, ఎన్టీఆర్ ఎప్పుడు తన దగ్గరకు వచ్చినా.. ఏమ్జీయార్ అడిగే మొదటి ప్రశ్న ‘మా కోసం ఈ రోజు ఏమి తెచ్చావ్ సోదరా’ అని. అయితే, ఎన్టీఆర్ కి ఉన్న మేకప్ మెన్ అవసరాన్ని గ్రహించిన ఏమ్జీయార్, ఆ రోజు ఎన్టీఆర్ వెళ్లే సమయానికి ఓ వ్యక్తిని పిలిచి.. ‘మేము మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాం’ అంటూ ఆ వ్యక్తిని ఎన్టీఆర్ కి పరిచయం చేశారు ఏమ్జీయార్.
Also Read: Tollywood: 2021 రౌండప్ : ఈ ఏడాది భారీ డిజాస్టర్స్ ఇవే !
ఈయన పేరు ‘పీతాంబరం’, మాకు ఎంతో ఇష్టమైన మేకప్ మెన్. మాకు పర్సనల్ గా మేకప్ చేస్తూ ఉంటారు. అయితే, మీకు ఉన్న మేకప్ మెన్ సమస్యను విన్నాక, మాకు కంటే మీకే ఈయన అవసరం ఉంది సోదరా’ అన్నారు ఎంజీఆర్. ఏమ్జీయార్ మాట కాదనలేక ఎన్టీఆర్ పీతాంబరంతో అక్కడ నుంచి బయలుదేరారు.
ఆ మరసటి రోజు ఎన్టీఆర్ కి, అసలు పీతాంబరం ఎలా మేకప్ వేస్తాడో అని అనుమానం కలిగింది. పిలిచి రాముడి పాత్ర కోసం మేకప్ వేయమన్నారు. మేకప్ వేయడం ముగిసింది. పీతాంబరం మేకప్ వేసే విధానానికి ఎన్టీఆర్ ముగ్దులయిపోయారు.
Also Read: Tollywood: 2021 ఇయర్ రౌండప్ : టాలీవుడ్ కి ఊపు తెచ్చిన సినిమాలివే !