
Coriander Powder : మన వంటింట్లో ఉండే పదార్థాలతో మన ఆరోగ్యం ముడి పడి ఉంటుంది. కూరల్లో వాడే వాటితో మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో వాటిని వాడుకుని మన అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శరీరంలో పేరుకుపోయే మలినాలు దూరం చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. వంటింట్లో ఉండే ధనియాలు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. అరిచేతులు, అరికాళ్లలో మంటలు, తిమ్మిర్లు తగ్గించడం, కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు పరిష్కరిస్తాయి.
ధనియాల పొడిని వంటల్లో వాడతాం. దీంతో అవి రుచిగా ఉంటాయి. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. సరైన పద్ధతిలో వినియోగించుకుంటే మనకు ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవడంలో ఉపయోగపడతాయి. వీటితో కషాయం చేసుకుని తాగితే కూడా ఎంతో మేలు కలుగుతుంది. దీనికి గాను మనం ఒక గిన్నెలో ఒక గ్లాసు నీరు పోసి అందులో రెండు స్పూన్ల ధనియాలు వేసుకుని మూత పెట్టాలి. రాత్రంతా నానబెట్టి ఉదయం వాటిని ఐదు నిమిషాలు వేడి చేసి తరువాత వడ కట్టాలి. ఈ కషాయాన్ని రోజు తాగుతుంటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
ఇలా తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ధనియాల్లో కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. రక్తహీనత అదుపులో ఉంటుంది. చర్మ సమస్యలు దూరమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కంటి ఆరోగ్యం బాగుంటుంది. ఈ కషాయం రోజు తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు.

ఈ కషాయం తాగడంతో శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. ఇలా సులభమైన చిట్కాలు పాటించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ధనియాలు మనకు ఎన్నో ఆరోగ్య లాభాలు దక్కుతాయి. ధనియాల కషాయం తాగితే మన శరీరం ఫ్రెష్ గా అవుతుంది. అందుకే దీన్ని తాగి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.