
Sorghum Bread : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటున్నారు. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, గుండెపోటు వంటి రోగాలు వస్తుండటంతో ఆహార అలవాట్ల మీద చొరవ తీసుకుంటున్నారు. ఏది పడితే అది తింటే కలిగే అనర్థాల గురించి పట్టించుకుంటున్నారు. ఫలితంగా కాస్తంత రిలాక్స్ గా ఉంటున్నారు. అన్నింటికి అన్నమే ప్రధాన కారణమని తెలుసుకుంటున్నారు. తరువాత ఏం చేయాలనే దానిపై ఫోకస్ పెడుతున్నారు. మన ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు. ఆరోగ్యం కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మన పూర్వీకులు తిన్న వాటిని మళ్లీ తినేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమలో జొన్నరొట్టె ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం.
జొన్నరెట్టె
మన శరీరానికి బలవర్ధకమైన ఆహారాల్లో జొన్నలు కూడా మంచివి. మన ఆరోగ్యాన్ని బాగు చేయడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే జొన్నలతో అంబలి చేసుకోవచ్చు. రొట్టె చేసుకోవచ్చు. ఇంకా అన్నంగా కూడా వండుకుని తినొచ్చు. ఇన్ని రకాలుగా వీటిని వాడుకునే అవకాశం ఉంటుంది. అందుకే మన రోజువారీ ఆహారంలో వీటిని భాగం చేసుకోవడం వల్ల మనకు మంచి ప్రయోజనాలే దక్కుతాయి.
ఫైబర్
జొన్నల్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో వీటిని మనం ఆహారంగా తీసుకోవడం మంచిది. ఇవి త్వరగా జీర్ణం అవుతాయి. జొన్న రొట్టె, అన్నంగా చేసుకుని తింటే మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో ఇవి సాయపడతాయి. ఇందులో విటమిన్లు, ప్రొటీన్లు ఉండటతో ఎముకల బలానికి ఎంతో దోహదపడతాయి.
రక్తసరఫరా
మన శరీరానికి రక్తసరఫరా కూడా ముఖ్యమే. శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా కాకపోతే అనారోగ్యాలొస్తాయి. జొన్నలను ఆహారంగా తీసుకుంటే రక్తసరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాయి. దీంతో మన ఆరోగ్యం మెరుగవుతుంది. జొన్న రొట్టెలను వారానికి రెండు సార్లు తిన్నా సరే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. రక్తపోటు కూడా పెరగదు.

గుండెకు మేలు
రక్తంలో చెడు కొవ్వును తగ్గిస్తుంది. మంచి కొవ్వును పెంచుతుంది. ఫలితంగా గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తాయి. జొన్నల్లో ఇన్ని రకాల లాభాలున్నందు వల్ల వీటిని తరచుగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బుల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి. చర్మం మెరిసేలా చేస్తాయి. జుట్టు రాలకుండా కూడా నిరోధిస్తాయి. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉండటంతో వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తుంది.
అధిక బరువు
ఇవి అధిక బరువును నిరోధిస్తాయి. ఊబకాయం రాకుండా చేస్తాయి. ఇలా జొన్నలతో చేసిన వాటితో మనకు ఆరోగ్యం బాగు పడుతుంది. అందుకే రోజు జొన్నలతో చేసిన వాటిని తీసుకుంటే మన ఆరోగ్య వ్యవస్థ బాగుంటుంది. ఫలితంగా మనకు రోగాలు రాకుండా ఉంటాయి. మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. దీంతో మనం జొన్నలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో రెట్లు బాగుంటుంది.