
Anasuya Fire On Indigo: అనసూయ వెరీ బోల్డ్. కోపమైనా సంతోషమైనా పబ్లిక్ గా చూపించేస్తుంది. ఆమెకు ఎలాంటి దాపరికాలు ఉండవు. తాజాగా ఆమెకు ఓ సంస్థ మీద కోపం వచ్చింది. ఐ హేట్ ఇండిగో ఎయిర్ లైన్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అనసూయ ట్వీట్ పరిశీలిస్తే… ‘ఇండిగో ఎయిర్ లైన్స్ అంటే నాకు ఇష్టం లేదని అధికారికంగా చెబుతున్నాడు. ఇలాంటి నాణ్యత లేని సేవలతో దేశీయ విమానయాన రంగాన్ని వారు ఏలడం విచారకరం’ అని రాశారు. ఇండిగో ఎయిర్ లైన్స్ కనీస ప్రమాణాలు పాటించడం లేదు, సర్వీస్ క్వాలిటీ లేదు. అయినప్పటికీ ఇండియాలో వారిదే ఆధిపత్యం. ఇది దారుణ పరిణామం… అని అనసూయ తన అభిప్రాయం, అసహనం తెలియజేశారు.
అనసూయకు అంతగా కోపం రావడానికి ఆ సంస్థ చేసిన తప్పేంటనేది తెలియదు. కారణం ఆమె తన ట్వీట్లో మెన్షన్ చేయలేదు. గతంలో కూడా అనసూయ ఇలానే విమాన సంస్థ మీద ఫైర్ అయ్యారు. బుకింగ్ లో ఉన్న విధంగా సీటింగ్ ఆర్డర్ లేదని, పాడైపోయిన సీటు కారణంగా నాకు ఇష్టమైన డ్రెస్ చిరిగిపోయిందంటూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఇటీవల విమానయాన సంస్థల మీద ఫిర్యాదులు ఎక్కువైపోయాయి. మంచు లక్ష్మి సైతం ఇదే తరహాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్వరంతో బాధపడుతుంటే వైద్య సహాయం అందాలని ఆమె వాపోయారు.

మరోవైపు అనసూయ నటిగా ఫుల్ బిజీ అయ్యారు. ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. యాంకరింగ్ మానేసిన అనసూయ యాక్టింగ్ పై దృష్టి పెట్టారు. ఇటీవల ఆమె నటించిన రంగమార్తాండ విడుదలైంది. ఈ చిత్రంలో అనసూయ ప్రకాష్ రాజ్ కోడలు పాత్ర చేశారు. సినిమా కమర్షియల్ గా ఆడకున్నా మంచి పేరు వచ్చింది. అనసూయ పాత్రకు ప్రశంసలు దక్కాయి.
అనసూయ ఖాతాలో పుష్ప 2 వంటి భారీ ప్రాజెక్ట్ ఉంది. పుష్ప సిరీస్లో అనసూయ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ ఉన్న పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. దాక్షాయణిగా ఆమె డీగ్లామర్ లుక్ లో అలరించారు. పుష్ప 2లో దాక్షాయణి పాత్రకు దర్శకుడు సుకుమార్ ఎలాంటి ముగింపు ఇచ్చారో చూడాలి. అలాగే పలు సినిమాలు, వెబ్ సిరీస్లు అనసూయ ఖాతాలో ఉన్నాయి. కొన్నేళ్ల పాటు అనసూయ కెరీర్ కి ఎలాంటి ఢోకా లేదు.
I officially hate @IndiGo6E .. sad that we have them predominating the domestic airlines here.. such stooping standards of service..
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 14, 2023