Ash Gourd Benefits: బూడిద గుమ్మడి కాయ అంటే అందరికి దిష్టితీసే కాయగానే గుర్తిస్తారు. కానీ అది మంచి కూరగా పనిచేస్తుందని చాలా మందికి తెలియదు. అందులో ఉండే పోషకాల గురించి తెలిస్తే విడిచిపెట్టరు. ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం చేస్తుంటారు. అలాంటి బూడిద గుమ్మడికాయ ఆయుర్వేదంలో ఎంతో గుర్తింపు పొందింది. చాలా రకాల మందుల్లో బూడిద గుమ్మడికాయను వాడతారని ఎంతమందికి తెలుసు. బూడిద గుమ్మడి కాయలో ఉండే విటమిన్లు, మినరల్స్, పోషకాల గురించి తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి బూడిద గుమ్మడికాయను ఆహారంలో భాగంగా చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయని తెలిసిందే.

బూడిద గుమ్మడి తీసుకుంటే గుండె, కిడ్నీల పనితీరు మెరుగుపరుస్తుందని తెలుస్తోంది. ఇందులో ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు చెబుతున్నారు. మధుమేహులకు మంచి మందుగా పనిచేస్తుంది. చక్కెరను కొవ్వుగా మార్చడాన్ని నిరోధిస్తుంది. దీంతో బూడిద గుమ్మడికాయను విరివిగా ఆహారంలో తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. జ్వరం, విరేచనాల విరుగుడుకు కూడా ఇది ఉపయోగపడుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బూడిద గుమ్మడి కాయను రోజువారి ఆహారంలో తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయని తెలిసిందే.
ఇందులో 96 శాతం నీరే ఉంటుంది. 4 శాతం ప్రోటీన్లు, విటమిన్లు, పోషకాలు ఉంటాయి. పూర్వ కాలం నుంచే బూడిద గుమ్మడితో పలు ఆహార పదార్థాలు చేసుకుని వినియోగిస్తున్నట్లు ఆధారాలు చెబుతున్నాయి. అధిక స్థాయిలో యాంటి ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం తక్కువ పరిమాణంలో ఉంటాయని తెలిసిందే. బూడిద గుమ్మడిని రసం చేసుకుని తాగితే కూడా మంచి ప్రయోజనం ఉంటుందని తెలుసుకోవాలి. బూడిద గుమ్మడిలో ఇన్ని పోషకాలు ఉండటంతో దాన్ని మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం మంచిదని చెబుతున్నారు.

కడుపు ఉబ్బరం, మలబద్దకం నుంచి ఉపశమనం లభించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తులు, ముక్కులో ఉన్న కఫాన్ని తొలగిస్తుంది. శ్వాస క్రియను మెరుగుపరుస్తుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. శారీరక బలహీనతతో బాధపడుతున్న వారు బూడిద గుమ్మడిని తీసుకుంటే మేలు కలుగుతుంది. బూడిద గుమ్మడి తో ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. దీంతో మనం బూడిద గుమ్మడిని ప్రతిరోజు తీసుకుని రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:Pawan Kalyan On Secularism: అవకాశవాద సెక్యూలరిస్టులూ , పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోండి