https://oktelugu.com/

Ashu Reddy: వైరల్ అవుతున్న అషురెడ్డి ముద్దుల వీడియో.. ఛీ అంటున్న నెటిజన్లు

Ashu Reddy: బిగ్ బాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన అషూరెడ్డి తన చేష్టలతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గానే నిలవడం తెలిసిందే. ఆమెపై పాజిటివ్ కామెంట్ల కంటే నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా రావడం తెలిసిందే. ఆమెకు కూడా నెగెటివ్ కామెంట్లే బాగుంటాయనే సంగతి కూడా మనకు తెలుసు. అలాంటి అషురెడ్డి ఎప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా తన ప్రచారం చేసుకోవడంలో పెద్ద విచిత్రమేమీ లేదు. తన హాట్ ఫొటోలతో నెట్టింట్లో సందడి చేయడం ఆమెకు అలవాటుగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 16, 2022 / 08:44 AM IST
    Follow us on

    Ashu Reddy: బిగ్ బాస్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన అషూరెడ్డి తన చేష్టలతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గానే నిలవడం తెలిసిందే. ఆమెపై పాజిటివ్ కామెంట్ల కంటే నెగెటివ్ కామెంట్లే ఎక్కువగా రావడం తెలిసిందే. ఆమెకు కూడా నెగెటివ్ కామెంట్లే బాగుంటాయనే సంగతి కూడా మనకు తెలుసు. అలాంటి అషురెడ్డి ఎప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా తన ప్రచారం చేసుకోవడంలో పెద్ద విచిత్రమేమీ లేదు. తన హాట్ ఫొటోలతో నెట్టింట్లో సందడి చేయడం ఆమెకు అలవాటుగా మారుతోంది. ఎప్పుడైనా ఏదో ఒక అంశంలో సోషల్ మీడియాలో వైరల్ కావడం అంటే ఆమెకు ఓ సరదాగా మారింది. ఇందులో భాగంగానే ఎప్పుడైనా ఏదో ఒక విధంగా వైరల్ వీడియోలు పోస్టు చేసి అందరి నోళ్లలో నానడం ఆమెకు ఉన్న నైజం.

    Ashu Reddy

    బిగ్ బాస్ షో లోకి ఎంత త్వరగా వచ్చిందో అంతే త్వరగా వెళ్లిపోయింది. ఆమె చేష్టలకు అందరు బాధ్యులయ్యారు. ఆమె చేసిన పనులకు విసిగిపోయారు. రాహుల్ తో ప్రేమాయణం, ఎక్స్ ప్రెస్ హరితో కలిసి ఉండటంతో ఆమెకు ఇంకా ఎక్కువ ప్రాచుర్యం లభించింది. ఇదే ఆమెకు కావాల్సింది. జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్నా ఆమె లక్షణాలేవి ఈమెకు లేకపోవడం మంచిదే అయింది. లేకపోతే సమంత పేరు కూడా మచ్చ వచ్చేది. అంతలా రెచ్చిపోయి పిచ్చిపనులు చేస్తూ అషురెడ్డి తెగ ప్రచారం చేసుకుంది.

    Also Read: Anasuya Bharadwaj: అనసూయపై ఆ డైరెక్టర్ ఏం కామెంట్లు చేశాడు?

    సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు కూడా తన హాట్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. దీంతో వారికి కూడా అలుపు వస్తుంది. ఈమె ఫొటోలు, వీడియోలు చూస్తుంటే వారికి విసుగొస్తోంది. అంతలా వారిని ఆడేసుకుంటుంది. ఫ్రెండ్ షిప్ డే రోజు కూడా నెగెటివ్ కామెంట్లు చేసింది. తన లవ్ కు తన స్నేహితురాలే విలన్ గా మారిందని చెప్పింది. తన లవర్ ను తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించిందని సంచలన కామెంట్లు చేసింది. దీంతో తనకు బెస్ట్ ఫ్రెండ్స్ కంటే బ్యాడ్ ఫ్రెండ్స్ ఉండటమే దురదృష్టమని పోస్టులు పెట్టింది. దీంతో నెటిజన్లు కూడా తెగ బాధపడిపోయారు.

    Ashu Reddy

    అషురెడ్డి ఏదో ఒక విషయంలో వైరల్ కావాలనేది ఆమె లక్ష్యం. ఇందుకు గాను ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటుంది. పవన్ కల్యాణ్ పేరు టాటూగా వేయించుకుని వైరల్ అయింది. తరువాత క్రేజీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ కూడా వివాదాలకు కేంద్ర బిందువు అయింది. ఇలా పలు రకాల్లో నెగెటివ్ కామెంట్లు సృష్టించుకుని హంగామా చేస్తుంది. అఖిల్ అషురెడ్డి మధ్య కూడా ఏదో ఉందనే టాక్ వచ్చేలా చేసుకుంది. ఇలా అన్నింట్లోనే నెగెటివ్ థాట్స్ వచ్చేలా చేసి వైరల్ గా మారడం ఆమెకు ఉన్న ఓ లక్షణంగా తెలుస్తోంది.

    అషురెడ్డి తన ముద్దుల పెంపుడు కుక్క రాజుతో సరదాగా ముద్దులు పెట్టుకోవడం కూడా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఛీఛీ అంటూ చీవాట్లు పెడుతున్నారు. కుక్కకు ముద్దులు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనికి ఆమె సమాధానం వింటే మనకు వింత కలుగుతుంది. జంతువులకు మనసిస్తే అవి బ్రేకప్ చెప్పవట. జీవితాంతం కలిసే ఉంటాయట. దీంతో జంతువులపై ఆమెకు ఉన్న పిచ్చికి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అషురెడ్డి ఇదేం పని అంటూ కామెంట్లు పెట్టడం వైరల్ గా మారుతోంది.

    Also Read:Indraja: పెద్ద బ్యానర్‌ అడిగితే ఇష్టం లేకపోయినా చేయాలి… సంచలన విషయాలు బయటపెట్టిన ఇంద్రజ !

    Tags