https://oktelugu.com/

Devi Sri Prasad- Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమానులకు క్షమాపణలు చెప్పిన దేవిశ్రీ ప్రసాద్

Devi Sri Prasad- Allu Arjun Fans: టాలీవుడ్ లో అల్లు అర్జున్ మరియు దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పంబక్కర్లేదు.ఎందుకంటే వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజిక్ పరంగా సెన్సషనల్ హిట్ అయ్యాయి..ఇప్పటి వరుకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో 9 సినిమాలు వచ్చాయి..ఈ 9 సినిమాలు కూడా మ్యూజిక్ పరంగా రీసౌండ్ వచ్చే రేంజ్ లో హిట్ అయ్యాయి..గత ఏడాది వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా సాంగ్స్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 16, 2022 / 09:04 AM IST
    Follow us on

    Devi Sri Prasad- Allu Arjun Fans: టాలీవుడ్ లో అల్లు అర్జున్ మరియు దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పంబక్కర్లేదు.ఎందుకంటే వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ మ్యూజిక్ పరంగా సెన్సషనల్ హిట్ అయ్యాయి..ఇప్పటి వరుకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో 9 సినిమాలు వచ్చాయి..ఈ 9 సినిమాలు కూడా మ్యూజిక్ పరంగా రీసౌండ్ వచ్చే రేంజ్ లో హిట్ అయ్యాయి..గత ఏడాది వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా సాంగ్స్ ఎంత పెద్ద చార్ట్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలోని కొన్ని పాటలు ఇండియానే ఊపేసాయి..ఇతర హీరోల అభిమానులు అయితే అల్లు అర్జున్ సినిమా అంటే చాలు దేవిశ్రీ ప్రసాద్ కి ఎక్కడలేని ఊపు వచేస్తాది..కానీ మా సినిమాలకు మాత్రం ఆ రేంజ్ మ్యూజిక్ ఇవ్వడు అంటూ సోషల్ మీడియా లో కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి..ఈ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ అలాంటిది..వీళ్లిద్దరి మధ్య ఉన్న రిలేషన్ కూడా చాలా గొప్పది అనే చెప్పొచ్చు..అయితే ఈరోజు ఆయన అల్లు అర్జున్ అభిమానులకు క్షమాపణలు చెప్తూ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    Devi Sri Prasad- Allu Arjun

    ఇక అసలు విషయానికి వస్తే ఈ నెల 2 వ తేదీన దేవిశ్రీప్రసాద్ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ ఒక ట్వీట్ వేస్తూ విష్ చేసాడు..దీనికి దేవిశ్రీప్రసాద్ రిప్లై ఇవ్వలేదు..అదేంటి మా హీరో అంత ప్రేమగా విష్ చేస్తే దేవిశ్రీప్రసాద్ రిప్లై ఇవ్వలేదు అంటూ అల్లు అర్జున్ అభిమానులు కాస్త నిరాశకి గురైయ్యారు..అయితే నిన్న అల్లు అర్జున్ విష్ చేసికొన ట్వీట్ ని క్వాట్ చేస్తూ ‘థాంక్యూ వెరీ మచ్ బన్నీ..మన తదుపరి ప్రాజెక్ట్ పుష్ప 2 కి కుమ్మేద్దాం’ అని చెప్తూనే చివరగా ‘దయచేసి అల్లు అర్జున్ అభిమానులు నన్ను క్షమించండి.

    Also Read: Ashu Reddy: వైరల్ అవుతున్న అషురెడ్డి ముద్దుల వీడియో.. ఛీ అంటున్న నెటిజన్లు

    Devi Sri Prasad

    నేను ఇంస్టాగ్రామ్ లో రిప్లై ఇచ్చాను కానీ ట్విట్టర్ లో చూసుకోలేదు..ఇప్పుడే చూస్తున్నాను’ అంటూ దేవిశ్రీప్రసాద్ పెట్టిన ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఇక పుష్ప 2 విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయినట్టు సమాచారం..ఈ నెలాఖరున నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం కూడా ఉందని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.

    Also Read:Anasuya Bharadwaj: అనసూయపై ఆ డైరెక్టర్ ఏం కామెంట్లు చేశాడు?

    Tags