Do You Know: ఇంత పెద్ద ప్రపంచంలో చాలానే వింతైన విశేషాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మనుషులకు తెలిసినవి ఉంటే మరికొన్ని తెలియనవి ఉంటాయి. ఎక్కువ శాతం తెలియని విశేషాలే మన ప్రపంచంలో ఉన్నాయి. ఇలాంటి విశేషాలను విన్న తర్వాత నిజంగా ప్రపంచంలోని వింతైనవి ఇలాంటివి ఉన్నాయా? అని మనలో చాలామందికే ఆశ్చర్యమనిపిస్తుంది. మరి అలాంటి ప్రపంచ విశేషాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
స్వచ్ఛమైన తేనె వంద ఏళ్లు అయిన కూడా పాడవ్వదు. అదే కల్తీ నూనె అయితే కొన్నాళ్లే పాడవుతుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెను తయారు చేయడానికి కనీసం 12 తేనెటీగలు అయిన వాటి జీవితాంతం అయిన కష్టపడాల్సిందే.
సాధారణంగా పుచ్చకాయలు పెద్దగా ఉంటాయి. వేసవిలో విరివిగా దొరికే వీటిని అందరూ ఇష్టంగా తింటారు. కానీ ఆఫ్రికన్లు ఈ పుచ్చకాయను ఎడారిలో జగ్గులు, కంటైయినర్లుగా వాడేవారంట.
వేరుశనగలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే ఇవి గింజలు జాతికి చెందినవని చాలా మంది అనుకుంటారు. కానీ ఇవి చిక్కుడు గింజల జాతికి చెందినవి.
ఫాస్ట్‌పుడ్స్, ఇంకా ఏవైనా తినడానికి ఎక్కువగా కెచప్ వాడుతుంటారు. అయితే 1800ల కాలంలో కెచప్‌ను డయేరియాకి ఔషధంగా ఉపయోగించేవారట.
అప్పట్లో ఉల్లిపాయ ఆకారాన్ని బల్డ్ అనేవారట. దీని ద్వారానే విద్యుత్ లైట్‌కు బల్బ్ అనే పేరు వచ్చిందట.
దేవతల దేశంగా పెరొందిన కేరళ రాష్ట్రం ప్రకృతి అందాల గురించి చెప్పక్కర్లేదు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ దొరికే రైస్ కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రజలు 80 శాతం వరకు వాణిజ్య పంటలనే ఎక్కువగా పండిస్తారు. అందుకే వీరు బియ్యం, పప్పులను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటారు.
మొక్కజొన్నను ఎక్కువగా చైనాలో పండిస్తారు. వీరి డైలీ డైట్‌లో మొక్కజొన్నలు తప్పకుండా ఉంటాయి.
పాకిస్థాన్ జాతీయ కూరగాయ బెండకాయ అనే విషయం మీకు తెలుసా.
నైజీరియాలో మామిడిలాంటి అల్ఫాన్సో పండు పండుతుంది. దీనిని అక్కడ వారు కిరోసిన్ అంటారు. ఎందుకంటే ఈ పండు కిరోసిన వాసన వస్తుందట. అందుకే దీనిని కిరోసిన్ పండు అంటారు.
మనం గాలిని చూడలేనట్లు చేపలు నీటిని చూడలేవు. ఎందుకంటే వాటి మెదడు నీటిని ఫిల్టర్ చేస్తుందట.
గోళ్లు, వెంట్రుకలను కత్తిరించిన కూడా నొప్పి రాకపోవడానికి కారణం ఇందులో కెరోటిన్ ఉండటమే. జుట్టు, గోళ్లు మనిషి చనిపోయిన తర్వాత కూడా పెరుగుతాయట.
ఒక సిగరెట్‌లో 4800 కెమికల్స్ ఉంటాయట. ఇవి మొత్తం 69 క్యాన్సర్లకు కారకం అవుతాయట.
మానవుని ఒక్కో వెంట్రుక 100 గ్రాముల బరువును మోయగలదట. మొత్తంలో తలలోని అన్ని వెంట్రుకలను కలిపి 12 టన్నుల బరువు మోసే సామర్థ్యం కలిగి ఉంటాయట.
పెన్సిల్‌తో భూమి మీదే కాకుండా అంతరిక్షంలో, నీటిలోపల కూడా రాయవచ్చట. ఒక్కో పెన్సిల్‌తో సుమారుగా 45000 వేల పదాలను రాయవచ్చట.