Allari Naresh Wife: అల్లరి నరేష్ భార్య వృత్తిపరంగా ఏం చేస్తారో తెలుసా.. ఈమె సంపాదన తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ..!

Allari Naresh Wife: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన దివంగత ఈవీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎన్నో అద్భుతమైన కామెడీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు ఈ క్రమంలోనే నరేష్, రాజేష్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఒకానొక సమయంలో ఈ ఇద్దరూ మంచి చిత్రాలలో నటించి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ప్రస్తుతం వీరికి ఏ విధమైనటువంటి అవకాశాలు లేవనే చెప్పాలి. ఇదిలా ఉండగా నరేష్ అల్లరి సినిమా […]

Written By: Kusuma Aggunna, Updated On : December 26, 2021 12:11 pm
Follow us on

Allari Naresh Wife: టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన దివంగత ఈవీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎన్నో అద్భుతమైన కామెడీ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు ఈ క్రమంలోనే నరేష్, రాజేష్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.

ఒకానొక సమయంలో ఈ ఇద్దరూ మంచి చిత్రాలలో నటించి గుర్తింపు సంపాదించుకున్నప్పటికీ ప్రస్తుతం వీరికి ఏ విధమైనటువంటి అవకాశాలు లేవనే చెప్పాలి. ఇదిలా ఉండగా నరేష్ అల్లరి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కావడం ఆ సినిమా మంచి విజయవంతమవడంతో ఏకంగా అతనికి అల్లరి నరేష్ అనే పేరు వచ్చింది.

అల్లరి నరేష్ పలు సినిమాలలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే అల్లరినరేష్ 2015లో విరూప అనే అమ్మాయిని ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఇక అల్లరి నరేష్ కి సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయినప్పటికీ తన భార్య విరూప మాత్రం నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారని ఈమె ఏ మాత్రం తన భర్త సంపాదనపై ఆధారపడదు.

విరూప వృత్తిపరంగా ఆర్కిటెక్ట్ గా పనిచేస్తుందట. ఈ క్రమంలోనే ఈమె పెద్ద మొత్తంలోనే సంపాదిస్తుందని, ఈమె సంపాదన తన భర్త అల్లరి నరేష్ సంపాదన కన్నా ఎక్కువే అని సమాచారం. చాలా సంవత్సరాల తర్వాత అల్లరి నరేష్ నాంది అనే సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకొని తిరిగి ఇండస్ట్రీలో బిజీ అయ్యారు.