https://oktelugu.com/

Radhe Shyam: ‘రాధేశ్యామ్’ స్థాయిని కావాలనే తగ్గించారు !

Radhe Shyam: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ట్రైలర్ చూశాక, చాలా మందికి కలిగిన అనుమానం.. అసలు ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేదా ? అని. సినిమా పోస్టర్స్ దగ్గర నుంచీ ట్రైలర్ వరకూ అంతా రొమాంటిక్ మయమే అన్నట్టు సాగాయి. ఎంత లవ్ స్టోరీ అయితే మాత్రం.. ఒక స్టార్ హీరో.. పైగా పాన్ ఇండియా స్టార్ హీరో.. మరి అలాంటి హీరో మీద పరిపూర్ణమైన ప్రేమ కథను మాత్రమే చెబితే.. ఫ్యాన్స్ ఎలా ఫీల్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 26, 2021 / 11:53 AM IST
    Follow us on

    Radhe Shyam: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ట్రైలర్ చూశాక, చాలా మందికి కలిగిన అనుమానం.. అసలు ఈ సినిమాలో ఒక్క ఫైట్ కూడా లేదా ? అని. సినిమా పోస్టర్స్ దగ్గర నుంచీ ట్రైలర్ వరకూ అంతా రొమాంటిక్ మయమే అన్నట్టు సాగాయి. ఎంత లవ్ స్టోరీ అయితే మాత్రం.. ఒక స్టార్ హీరో.. పైగా పాన్ ఇండియా స్టార్ హీరో.. మరి అలాంటి హీరో మీద పరిపూర్ణమైన ప్రేమ కథను మాత్రమే చెబితే.. ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారు ?

    Radhe Shyam

    యువీ క్రియేషన్స్ వారికి సినిమా పై కనీస అవగాహన అయినా ఉందా ? వాళ్లకు సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో తెలియదు, ఇక సినిమాను ఎలా తీయాలో కూడా తెలియదా ? అంటూ యువీ క్రియేషన్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ చాలా సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. యువీ క్రియేషన్స్ లో సినిమా పై పట్టు లేదు అని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

    చెప్పిన టైం కి ఏ రోజూ సినిమాని కరెక్ట్ గా ప్రమోట్ చేయలేదు. అయితే, అది పొరపాటుగా జరిగిందా ? లేక, కావాలనే సినిమా పై భారీ అంచనాలు పెరగకుండా ప్లాన్డ్ గా చేశారా ? అనే అనుమానం కలుగుతుంది. అందుకే, ట్రైలర్ ను కూడా తెలివిగా కట్ చేశారు అనిపిస్తుంది. ఎలాగూ సాహూ పై భారీగా అంచనాలను పెంచి చివరకు ప్లాప్ టాక్ ను తెచ్చుకున్నారు.

    Also Read: రాజమౌళికి పవన్ కళ్యాణ్ ఔట్.. తగ్గేదే లే అంటున్న ప్రభాస్.. కాంప్రమైజ్ అయ్యారా?

    అందుకే, ‘రాధేశ్యామ్’ విషయంలో యువీ క్రియేషన్స్ తెలివిగా ముందుకు వెళ్తుంది. ప్రమోషన్స్ దగ్గర నుంచీ ట్రైలర్ వరకూ ఎక్కడా అంచనాలు భారీ స్థాయిలో పెరగకుండా చూసుకున్నారు. నిజానికి సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. పైగా భూకంపం, సునామీ తాలూకు అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి. పైగా హాలీవుడ్ సినిమాల్లో ఉండే రేంజ్ విజువల్స్ అవి.

    ఇక అనేక హాలీవుడ్ సినిమాలకు పని చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్ నిక్ పాల్ ఈ చిత్రానికి వర్క్ చేశాడు. కాబట్టి.. ఈ సినిమాలో పూర్తిగా ప్రేమించుకోవడాలు, పాటలు పాడుకోవడాలే కాదు, కళ్ళు చెదిరే యాక్షన్స్, అబ్బుర పరిచే విజువల్స్ కూడా ఉండబోతున్నాయి. విపరీతమైన అంచనాలు పెరుగుతాయి అని నిర్మాతలు ‘రాధేశ్యామ్’ కాస్త తగ్గించి చూపిస్తున్నారు.

    Also Read: సిగ్గా.. దగ్గా.. ఏంటి డార్లింగ్ ఇది!

    Tags