
Tarakaratna- Lakshmi Parvathi: నందమూరి తారకరత్న గుండెపోటు కి గురై ఇటీవలే కన్నుమూసిన ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.గత 23 రోజుల నుండి ఆయన బెంగళూరు లోని నారాయణ హృదయాలయ లో చికిత్స చేయించుకుంటూనే ఉన్నాడు.స్పృహ లోకి వస్తాడని అందరూ ఆశించారు, విదేశాల నుండి ప్రత్యేక వైద్య బృందం ని కూడా రప్పించి ఆయనకీ శస్త్ర చికిత్స చేసారు కానీ ఫలితం లేకుండా పోయింది.
ప్రస్తుతం ఆయన భౌతిక కాయాన్ని ఆయన స్వగృహం లో అభిమానుల సందర్శనార్థం ఉంచారు.టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు కూడా తారకరత్న భౌతిక కాయాన్ని సందర్శించి నిన్న నివాళులు అర్పించారు.ఇది ఇలా ఉండగా తారకరత్న గురించి గత రెండు రోజులుగా ఒక సంచలన వార్త సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది..ఈ వార్త తెలుగు దేశం పార్టీ పై తీవ్రమైన వ్యతిరేకత వచ్చేలా చేస్తుంది.
అదేమిటి అంటే తారకరత్న చనిపోయి చాలా రోజులే అయ్యింది అట.ఎప్పుడైతే ఆయన నారాలోకేష్ ‘యువ గళం’ పాదయాత్ర లో కుప్పకూలి క్రింద పడిపోయాడో అప్పుడే ఆయన గుండె చప్పుడు ఆగిపోయిందట.ఆ తర్వాత వెంటనే సమీపం లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేసి CPR ద్వారా పల్స్ రప్పించారు.

కానీ పరిస్థితి అప్పటికే విషమం అయ్యింది, వెంటనే బెంగళూరు లోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పటికీ ఆయన మరణించాడని, ఆ వార్త బయటకి వస్తే ఎక్కడ లోకేష్ పాదయాత్ర కి చెడ్డపేరు వస్తుందనే భయం తో చంద్రబాబు ఈ విషయాన్నీ బయటకి రానివ్వకుండా మ్యానేజ్ చేసాడని, ఇది తెలుసుకొని తారకరత్న భార్య బిడ్డలు ఎంతో మానసిక వేదానికి గురయ్యారని, వైసీపీ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి ఈరోజు మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది.దీనితో సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు చంద్ర బాబు నాయుడు మరియు లోకేష్ ని ట్యాగ్ చేసి బండ బూతులు తిడుతున్నారు.