Homeలైఫ్ స్టైల్ABC Juice Benefits: సమస్త అనారోగ్య సమస్యలు ఈ జ్యూస్ తో మటు మాయం

ABC Juice Benefits: సమస్త అనారోగ్య సమస్యలు ఈ జ్యూస్ తో మటు మాయం

ABC Juice Benefits: పాతికేళ్లకే పొట్ట.. 30 ఏళ్లకే బట్ట.. నాలుగు ముద్దలు ఎక్కువ తింటే ఆయాసం, ప్రతి దానికీ ఆవేశం, నాలుగు అడుగులు వేద్దామంటే ఎక్కడా లేని నీరసం.. వీటి తర్వాత షుగర్, బీపీ.. ఇంకా చెప్పేది ఏముంది? ఉదయం నుంచి రాత్రి వరకు గుప్పెడు మాత్రలు వేసుకోవాల్సిందే. మరీ ఈ సమస్యలకు పరిష్కారం లేదా అంటే ఉంది. దాని పేరే ఏబీసీ జ్యూస్. పేరు చెప్పగానే వెంటనే ఏ అమెజాన్ లోనో, ప్లిఫ్ కార్ట్ లో వెతకకండి. దానిని మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఏం చక్కా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

ABC Juice Benefits
ABC Juice Benefits

అందరికీ అవగాహన పెరిగింది

సెలబ్రిటీల నుంచి ఆరోగ్య ఔత్సాహికుల వరకు ఆరోగ్యం పై అవగాహన పెరిగింది.
కోవిడ్ తర్వాత ఇది మరింత ఎక్కువైంది
అందుకే ఏబీసీ జ్యూస్ వెలుగులోకి వచ్చింది. ఏబీసీ లో ఏ అంటే యాపిల్, బీ అంటే బీట్‌రూట్ , సీ అంటే క్యారెట్.. వీటితో ఏబీసీ జ్యూస్‌ను తయారు చేయవచ్చు. ఇక ఈ రసంలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, జింక్, పొటాషియం, కాల్షియం, కాపర్, ఐరన్, మాంగనీస్, విటమిన్ ఏ, బీ6, సీ, డీ, ఈ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా, ఈ జ్యూస్ ప్రతి సర్వింగ్‌కు 150-60 కేలరీలు మాత్రమే కలిగి ఉంటుంది. దానిని తేలికపాటి భోజనంతో భర్తీ చేయవచ్చు. ఈ సాధారణ జ్యూస్‌ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచు కోవచ్చు.

టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది

ఉదయం పూట ఈ జ్యూస్‌ని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు పంపి, మంచి డిటాక్సిఫికేషన్‌కు సహాయపడుతుంది. ఈ జ్యూస్‌లోని పోషకాలు శరీరం కోల్పోయిన పోషకాలను తిరిగి పొందడంలో సహాయపడతాయి. శరీరాన్ని బాగా హైడ్రేట్‌గా ఉంచుతాయి.
ఈ జ్యూస్‌తో సహా అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో లోడ్ చేసి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది వాస్తవానికి ప్రతిరోజూ ఈ జ్యూస్ తాగడం వల్ల సహజంగా హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి. ఈ జ్యూస్‌లోని యాంటీఆక్సిడెంట్లు తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడతాయి. ఇది కణాల పునరుత్పత్తికి కూడా సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది.

ABC Juice Benefits:
ABC Juice Benefits:

వృద్ధాప్య సంకేతాలను తగ్గించుకోవచ్చు

ఈ పానీయాన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. కొంతవరకు రివర్స్ చేయడంలో సహాయపదుతుంది. యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, కె, ఇ, ఎ, బి-కాంప్లెక్స్ కంటెంట్‌లు దీనిలో ఎక్కువ ఉంటాయి ఇది చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. ఏబీసీ రసం జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జీవక్రియ రేటును పెంచుతుంది, ఇది మెరుగైన జీర్ణక్రియ, బరువు నిర్వహణలో మరింత సహాయపడుతుంది. అంతే కాకుండా, ఇందులో ఫైబర్, తక్కువ క్యాలరీలు ఉండే జ్యూస్ బెల్లీ ఫ్యాట్‌ని వేగంగా తగ్గించడంలో సహాయపడుతుంది.

జ్యూస్ ఇలా తయారు చేయవచ్చు

ఈ జ్యూస్‌ని ఒక్క సర్వింగ్‌లో తయారు చేయడానికి 1 ½ యాపిల్, 1 క్యారెట్, ½ బీట్‌రూట్ తీసుకోండి. వాటిని శుభ్రంగా కడగాలి. పై తొక్క తీసి మృదువైన మిశ్రమాన్ని తయారు చేయండి. ఆపై మీరు తురిమిన అల్లం వేసి మళ్లీ కలపవచ్చు. రసాన్ని వడకట్టి నిమ్మరసం, రాక్‌సాల్ట్‌తో కలపండి. ఇప్పుడు ఒక గాజు గ్లాసు లో తీసుకొని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఒకవేళ అల్లం, రాక్ సాల్ట్ నచ్చకపోతే అందులో కొంచెం తేనె వేసుకోవచ్చు. నోటికి తీపి తగలాలి అంటే చెరుకు రసం కూడా కలిపి తాగవచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular