Kerala: అతివలూ.. తస్మాత్ జాగ్రత్త.. మీ భర్తలను రంగు తక్కువని దూషించకండి…

కేరళ రాష్ట్రంలోని ఓ ప్రాంతం. అతని పేరు సిబిన్ (పేరు మార్చాం. ఆ యువతి పేరు కోమల (పేరు మార్చాం). వారిద్దరికీ పెళ్లయింది. కాపురం కూడా అన్యోన్యంగా సాగుతోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 31, 2024 11:56 am

Kerala

Follow us on

Kerala: “నలుపు నారాయణ మెచ్చు.. తెలుపు ఎవడు నచ్చు?” అనే రోజులు కాదు ఇవి. రంగు చుట్టూ మాత్రమే పరిభ్రమిస్తున్న రోజులు ఇవి.. పైగా ఆ రంగుకు ఈ లోకం అందం అనే పేరు పెట్టింది.. అందువల్లే ఉద్యోగం, డబ్బు మాత్రమే కాదు. నచ్చిన జోడి విషయంలో రంగును కూడా ప్రత్యేకంగా చూస్తున్నారు ఈ కాలపు యువత. రంగు సరిగ్గా లేకుంటే మొహమాటం లేకుండా పక్కన పెడుతున్నారు. అందువల్లే రంగు తక్కువ ఉన్న వాళ్ళకు పెళ్లిళ్లు కావడం లేదు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. ఇప్పుడు ఆ రంగు టాపిక్ ఎందుకు వచ్చింది అంటే.. ఆగండి ఆగండి అక్కడిదాకే వస్తున్నాం.. ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో రంగు అనేది అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశం. అంతేకాదు ఏకంగా విడాకులకే దారితీసింది.

అది కేరళ రాష్ట్రంలోని ఓ ప్రాంతం. అతని పేరు సిబిన్ (పేరు మార్చాం. ఆ యువతి పేరు కోమల (పేరు మార్చాం). వారిద్దరికీ పెళ్లయింది. కాపురం కూడా అన్యోన్యంగా సాగుతోంది. అయితే సిబిన్ కాస్త నలుపు రంగులో ఉంటాడు. జీవితంలో పరవాలేదు అనే స్థాయిలోనే స్థిరపడ్డాడు. అయితే ఇటీవల కోమల సిబిన్ రంగు గురించి పదేపదే దెప్పి పొడుస్తోంది. మొదట్లో దీన్ని అంతగా లెక్కలోకి తీసుకోని సిబిన్.. ఆ తర్వాత తన భార్య కోమలను హెచ్చరించాడు. జాగ్రత్తగా ఉండు అంటూ మందలించాడు. అయినప్పటికీ కోమల పట్టించుకోలేదు. ఇంకా మరింత రెచ్చిపోయింది. దీంతో సిబిన్ కు ఒళ్ళు మండింది. ఇంకేముంది కోర్టును ఆశ్రయించాడు.

” నా భార్య ప్రవర్తన బాగోలేదు. రోజూ నన్ను రంగు పేరుతో దూషిస్తున్నది. పెళ్లి సమయంలో ఆ రంగు చూసి ఒప్పుకుంది కదా.. మరి ఇప్పుడు ఎందుకు ఆమెకు నా రంగు ప్రధానంగా కనిపిస్తోంది. ఆమె మాటలు వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను. అవి నన్ను చిత్రవధకు గురి చేస్తున్నాయి. నా సమస్యకు మీరే పరిష్కారం చూపించాలి.. ఆమెతో నేను వేగలేక పోతున్నాను. నాకు విడాకులు మంజూరు చేయండి” అంటూ ఆ యువకుడు కోర్టుకు విన్నవించాడు.. అతని తరఫు వాదన విన్న న్యాయమూర్తి రెండవ మాటకు తావు లేకుండానే విడాకులు మంజూరు చేశాడు..” హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక మనిషిని రంగు పేరుతో దూషించడం సరికాదు. అది క్రూరత్వం కిందికి వస్తుంది.. ఇద్దరి మధ్య జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని విడాకులు మంజూరు చేస్తున్నానని” న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.. ఈ తీర్పు నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ” అతివలూ తస్మాత్ జాగ్రత్త.. మీ భర్తలను రంగు పేరుతో దూషించకండి.. అది మీ కుటుంబంలో చిచ్చును రగిలించవచ్చు” అని ముందస్తు జాగ్రత్తలు జారీ చేస్తున్నారు.