Big Toe Hair: చాలా మంది కాళి బొటన వేలికి వెంట్రుకలు ఉంటాయి. ఇది చదివిన వెంటనే మీ కాలికి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నారా? లేదంటే చెక్ చేసుకోండి. ఎందుకంటే దీనికి గుండె ఆరోగ్యానికి చాలా దగ్గర సంబంధం ఉంటుందట. అదేంటి ఈ రెండిటికి మధ్య సంబంధం ఉంటుందా? అని ఆలోచిస్తున్నారా…? అయితే తప్పకుండా మీరు ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
మామూలుగా వెంట్రుకలు పెరగాలంటే తగిన పోషకాలు అందాలి. అయితే ఈ వెంట్రుకలు చర్మం లోపల నుంచే వస్తాయి. ఇవి ఎదగడానికి రక్తం సహాయం అవసరం అవుతుంది. ఆహారంలోని పోషకాలు రక్తంలో కలిసి వెంట్రుకల కుదుళ్ళకు చేరుతాయట. దీంతో వెంట్రుకలు ఏర్పడుతాయి. కణాలు నిర్మాణం పెరిగేకొద్ది వెంట్రుకలు పెరుగుతూ వస్తాయి.
శరీరంలో వెంట్రుకలు మొలవాలి అంటే ఆ ప్రదేశంలో రక్తం సరఫరా అవ్వాల్సిందే. కొందరికైతే కాలి బొటనవేలు మీద కూడా వెంట్రుకలు పెరుగుతాయి. కానీ కొందరికి అసలు రావు. దీనికి కారణం ఆ ప్రదేశంలో రక్తం సరఫరా అవ్వదు. రక్తం సరఫరా అవడం లేదంటే కారణం రక్తాన్ని సరఫరా చేసే నాళాలైన ధమనుల్లో ఆటంకం ఏర్పడుతుందట. అయితే ఆహారం తినేటప్పుడు శరీరంలో కొంత కొవ్వు పేరుకుపోతుంది. ఇలా పేరుకుపోయే కొవ్వు ధమనుల్లో చేరుతుంది. కొవ్వు ఎక్కువ పేరుకపోవడం వల్ల రక్తం సరఫరా అవ్వదు.
ఇలా జరిగితే వెంట్రుకలు పెరగవు. కొందరికి తల, చేతుల పైన కూడా వెంట్రుకలు ఉండవు. అయితే వీరికి గుండె జబ్బులు రావా అనే సందేహం మీలో కలిగే ఉంటుంది. ఇక తల భాగం, చేతులు గుండెకు దగ్గరగా ఉంటాయి. కానీ గుండెకి కాలి బొటనవేలు చాలా దూరంగా ఉంటుంది. అందుకే ఈ కాలి బొటనవేలును లెక్కలోకి తీసుకోవాలి. కాలి బొటనవేలు పై వెంట్రుకలు బాగా పెరిగితే రక్తం సరఫరాకు ఎలాంటి ఆటంకం లేనట్టు. అంటే గుండె ఆరోగ్యంగా ఉన్నట్టే. దీంతో గుండెజబ్బులు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉన్నట్టే.
ఈ సమాచారం కేవలం సోషల్ మీడియా, ప్రజల విశ్వాసాల మేరకు మాత్రమే అందించడం జరిగింది. వీటిని ఒకే తెలుగు నిర్ధారించదు.